సలార్‌: ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌!

6 Jan, 2021 16:24 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్‌ బాలీవుడ్‌లోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్‌ కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మించ‌నున్నారు. చదవండి: ప్రభాస్‌ అభిమానులకు ‘రాధే శ్యామ్’‌ డైరెక్టర్‌ హామీ

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ మినహా మిగతా నటీనటుల ఎంపికను ఇంకా ఫైనల్‌ కాలేదు.  ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్యాస్టింగ్, టెక్నికల్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్‌ భామ దిశా పటాని నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సలార్‌ సినిమాలో విలన్‌ పాత్రలో కూడా ఓ బాలీవుడ్‌ స్టార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటుడు జాన్‌ అబ్రహం విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు పవర్‌ఫుల్‌ విలన్‌ ఉండాలని భావించిన చిత్ర యూనిట్‌ జాన్‌ అబ్రహాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: ‘జాంబీ రెడ్డి’ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రభాస్‌

మరిన్ని వార్తలు