శెభాష్‌ పాయల్‌ కపాడియా.. కేన్స్‌ గోల్డెన్‌ ఐ కైవసం.. స్టోరీ అలాంటిది మరి!

18 Jul, 2021 13:05 IST|Sakshi

ముంబైకి చెందిన పాయల్‌ కపాడియా.. ఈ పేరు అంతర్జాతీయ సినీ ప్రపంచంలో ఇప్పుడు మారుమోగుతోంది. 74వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఎ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’కిగానూ బెస్ట్‌ డాక్యుమెంటరీ అవార్డు అందుకుంది ఈమె. తద్వారా ఓ‘యిల్‌ డె‘ఓర్‌(గోల్డెన్‌ ఐ) గెల్చుకున్న మూడో మహిళగా.. భారత్‌ తరపు నుంచి ఈ ఘనత అందుకున్న తొలి ఫిమేల్‌ ఫిల్మ్‌మేకర్‌ చరిత్ర సృష్టించింది.

మొత్తం 28 డాక్యుమెంటరీలు ఈ ప్రతిష్టాత్మక కేటగిరీ కోసం పోటీపడగా.. ముంబైకి చెందిన పాయల్‌ కపాడియాను ప్రైజ్‌ వరిచింది. వెల్‌వెట్‌ అండర్‌గ్రౌండ్‌, ఆండ్రియా ఆర్నాల్డ్స్‌ కౌ, త్రో ది లుకింగ్‌ గ్లాస్‌ లాంటి టఫ్‌ డాక్యుమెంటరీలతో కపాడియా తీసిన ‘ఎ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’ పోటీపడి నెగ్గింది. ఢిల్లీ డైరెక్టర్‌ రాహుల్‌ జైన్‌ తీసిన ‘ఇన్విజిబుల్‌ డెమన్స్‌’ కూడా ఈ కేటగిరీలో పోటీ పడింది.


శెభాష్‌ పాయల్‌
విద్యార్థుల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో సాగే డాక్యుమెంటరీ ఇది. విడిపోయి దూరంగా ఉన్న తన లవర్‌కి ఓ యూనివర్సిటీ విద్యార్థి రాసే సీక్వెన్స్‌తో ‘ఎ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’ కథ సాగుతుంది. కలలు, వాస్తవం, జ్నాపకాలు, స్మృతులు.. ఇలా అన్నీ ఎమోషన్స్‌ మేళవించి ఉన్నాయి ఇందులో. ఒక సున్నితమైన అంశం చుట్టూ తిరిగే ఈ కథను చాలా సాహసోపేతమైన ప్రయత్నంగా అభివర్ణించారు ఓయిల్‌ డెఓర్‌ జ్యూరీ హెడ్‌ ఎజ్రా ఎడెల్‌మన్‌. 

ఇదివరకు ఒకసారి
ఎఫ్‌టీఐఐ స్టూడెంట్‌ అయిన కపాడియా.. వాట్‌ ఈజ్‌ సమ్మర్‌ సేయింగ్‌ డాక్యుమెంటరీ, లాస్ట్‌ మ్యాంగో బిఫోర్‌ ది మాన్‌సూన్‌ లాంటి షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసింది కూడా. 2017లో ఆమె తీసిన ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘సినీఫాండేషన్‌’ సెలక్షన్‌ కింద కేన్స్‌లో ప్రదర్శించారు కూడా. గోల్డెన్‌ ఐ కేటగిరీని ఆరేళ్ల క్రితం ప్రవేశపెట్టగా.. మూడుసార్లు మహిళలే గెల్చుకున్నారు.  మహిళ దర్శకుల్లో అగ్నెస్‌ వార్దా (ఫేసెస్‌ ప్లేసెస్‌ 2017), సిరియన్‌ జర్నలిస్ట్‌ ఫిల్మ్‌ మేకర్‌ వాద్‌ అల్‌ కతీబ్‌(సోమా-2019)కి ఈ ప్రెస్టేజియస్‌ అవార్డు గెల్చుకున్నారు. ఇప్పుడు పాయల్‌ మూడో వ్యక్తి. అయితే భారత్‌కు చెందిన షెర్లీ అబ్రహం-అమిత్‌ మధేషియా తీసిన ‘ది సినిమా ట్రావెలర్స్‌’కు 2017లో గోల్డెన్‌ అవార్డు స్పెషల్‌ జ్యూరీ మెన్షన్‌ మాత్రం ఇచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు