విశాల్‌ ఆరోపణలు.. ముంబై సెన్సార్‌ బోర్డుపై సీబీఐ కేసు నమోదు

5 Oct, 2023 13:24 IST|Sakshi

కోలీవుడ్ స్టార్, హీరో విశాల్‌ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. ముంబై సెన్సార్‌ బోర్డుపై కేసు నమోదు చేసింది. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ హక్కుల కోసం ముంబయిలోని సెన్సార్‌ బోర్డుకు(సీబీఎఫ్‌సీ) రూ.6.5 లక్షలు లంచం చెల్లించినట్లు ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు.

విశాల్‌ ఆరోపణల ఆధారంగా..  ముగ్గురు మధ్యవర్తులతో పాటు ముంబై సీబీఎఫ్‌సీకి చెందిన సభ్యులు, మరికొందరిపైనా విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి:  విశాల్‌ ఆరోపణతో సంచలన నిర్ణయం తీసుకున్న సెన్సార్‌ బోర్డు)

అసలేం జరిగిందంటే..

'నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌)కి రూ. 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన 2 లావాదేవీలు చేశాను. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, రెండు  సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. దీనిపై చర్యలు తీసుకోండి'  అంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే!

మరిన్ని వార్తలు