Chatrapathi's Suridu: 'ఛత్రపతి' సూరీడు ఇప్పుడెలా ఉన్నాడంటే?

26 Jul, 2021 20:54 IST|Sakshi

Chatrapathi Movie Child Artist Suridu: ఛత్రపతి సినిమా ప్రభాస్‌ రేంజ్‌ను పదిరెట్లు పెంచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 16 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ముఖ్యంగా సూరీడు ఓ సూరీడు అంటూ సాగే సన్నివేశం సినిమాలోని కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది. సూరీడు అనే చిన్న కుర్రాడిని రౌడీలు కొట్టి చంపడంతో అప్పటివరకు అణిగిమణిగి ఉన్న ప్రభాస్‌ ఒక్కసారిగా ఉగ్రనరసింహావతారం ఎత్తి విలన్ల మీద విరుచుకుపడే సీన్‌కు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుస్తాయి.

ఇక ఈ సినిమాలో సూరీడుగా నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ భశ్వంత్‌ వంశీ ఎంతో అమాయకంగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఛత్రపతి సినిమా ఆడిషన్స్‌ కోసం వెళ్లిన అతడు మొదటి రౌండ్‌లోనే సెలక్ట్‌ అయ్యాడట. అతడి అమాయక చూపులకు జక్కన్న ఫిదా అయిపోయి సూరీడుగా అతడే చేయాలని ఫిక్సయ్యాడట. ఆయన అంచనా కూడా నిజమైంది. సినిమాలో సూరీడు మదర్‌ సెంటిమెంట్‌ సీన్‌ ఇప్పుడు చూసినా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ప్రభాస్‌ పాత్రను ఎలివేట్‌ చేయడానికి సూరీడు పాత్ర బాగా పనికొచ్చింది. 

తాజాగా ఈ సూరీడు హీరో రేంజ్‌లోకి మారిపోయాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో భశ్వంత్‌ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఛత్రపతి సినిమాలో భశ్వంత్‌ వంశీ, అనిత చౌదరీ తల్లీకొడుకులుగా నటించిన విషయం తెలిసిందే కదా! తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి వైరల్‌ అవుతోంది. ఇందులో గడ్డం, మీసాలతో సూరీడు గుర్తుపట్టరానంతగా మారిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న అతడు టాలీవుడ్‌లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడట. అంటే మంచి అవకాశం దక్కితే త్వరలోనే సూరీడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు