దేశం ఓ వజ్రాన్ని కోల్పోయింది: చిరంజీవి

31 Aug, 2020 20:35 IST|Sakshi

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ(84) ఈ రోజు సాయంత్రం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్‌ మృతి పట్ల  ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రణబ్‌ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. ‘ప్రణబ్ ముఖర్జీ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. అతనితో నేను గడిపిన క్షణాలను ఎప్పటికి గుర్తుంటాయి. ఒక గొప్ప జ్ఞానం, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని సాధించిన వ్యక్తి మీరు. మిమ్మల్ని మిస్ అవుతాము సర్.. దేశం  ఈ రోజు ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రణబ్‌ దా..’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (ప్రణబ్‌ కుమార్తె భావోద్వేగ ట్వీట్‌)

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడం బాధగా ఉందని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అన్నారు. తన అత్యంత మేధోశక్తికి, ఉత్తమ నాయకునికి ఈ దేశం సంతాపం ప్రకటిస్తుందన్నారు. ప్రణబ్‌ కుటుంబ సభ్యులకు చేతులు జోడింది హృదయపూర్వక సంతాపం తెలిపారు. వీరితోపాటు అజయ్‌ దేవ్‌గణ్‌, తాప్సీ, రితేష్‌ దేశ్‌ముఖ్‌, లతా మంగేష్కర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వరుణ్‌ దావన్‌, శిల్పా శెట్టి, శ్రీను వైట్ల వంటి పలువురు ప్రముఖులు ప్రణబ్‌ మృతి పట్ల  ప్రగాఢ సంతాపం ప్రకటించారు.(దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం)

కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణ..బ్‌ ఆగస్టు 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో  ఆస్పత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా మెదడుకు డాక్టర్లు. సర్జరీ చేయగా..ఆస్పత్రిలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో కొంత కాలంగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే  ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందారు. రేపు ఢిల్లీలో ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు