ఏపీ ప్రభుత్వ చర్యలకు మనసారా కృతజ్ఞతలు: సీవీఎల్‌

6 Jan, 2022 20:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్‌ రేట్లపై తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రముఖ నటుడు సీవీఎల్‌ నరసింహారావు అన్నారు. పది మంది ప్రొడ్యూసర్ల కోసం సినిమా రేట్లపై రచ్చ చేస్తున్నారని సీవీఎల్‌ అన్నారు. పెద్ద సినిమాలు తీస్తున్నామంటున్న నిర్మాతలు ఆ స్థాయి సినిమా కోసం.. కింది స్థాయిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. మామూలు సినిమా అభిమాని టికెట్‌ రేటు రూ.1,000 ఉంటే ఫ్యామిలీతో కలిసి సినిమా ఎలా చూడగలరని ప్రశ్నించారు. టికెట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మంత్రికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని సీవీఎల్‌ నరసింహారావు అన్నారు. 

చదవండి: ('చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్‌ తీసుకో')

మరిన్ని వార్తలు