ఓటీటీలోకి ధనుష్‌ ‘నేనే వస్తున్నా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

22 Oct, 2022 15:07 IST|Sakshi

తమిళస్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్‌’. ఈ చిత్రాన్ని ‘నేనే వస్తున్నా’పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తెలుగులో విడుదల చేసింది. అయితే తమిళంలో హిట్‌ అయినప్పటికీ.. తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ఫ్రైమ్‌లో అక్టోబర్‌ 27నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుష్ ,సెల్వరాఘవన్ కలయికలో వచ్చిన 4వ చిత్రమింది.ఈ సినిమాలో ఇలి అవ్రామ్‌, ఇందుజా, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. 

మరిన్ని వార్తలు