దేత్తడి హారిక షాకింగ్‌ నిర్ణయం

11 Mar, 2021 03:33 IST|Sakshi

తెలంగాణ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా బిగ్‌బాస్‌ ఫేమ్‌ దేత్తడి హారిక నియామకంపై రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. దీనిపై తెలంగాణ ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హారిక ఎవరో తెలియదు అని చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేత్తడి హారిక షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడ‌ర్‌ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు హారిక ప్రకటించింది.

యూట్యూబ్ స్టార్‌గా ఉన్న హారిక బిగ్బా‌స్ సీజన్ 4లో టాప్‌ -5లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మహిళా దినోత్సవం రోజు ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం ఏర్పడింది. అయితే తాజాగా హారిక ఆ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. ‘‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్‌డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. లవ్యూ ఆల్‌’’ అంటూ హారిక చెప్పుకొచ్చింది. హారిక బ్రాండ్‌అంబాసిడర్‌ అంశం తెలంగాణతో పాటు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. మూడు రోజులుగా ఆమె చుట్టూనే వార్తలు నడిచిన విషయం తెలిసిందే. అయితే హారిక నియామకం వెనకాల ఏం జరిగిందో అనే విషయం సస్పెన్స్‌గా మారింది. దీనిపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు