Vaira Teaser: హీరోగా నటుడు దేవరాజ్‌ తనయుడు.. వైరం టీజర్‌ చూశారా?

18 Mar, 2023 09:57 IST|Sakshi

నటుడు దేవరాజ్‌ తనయుడు ప్రణమ్‌ దేవరాజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘వైరం’. సాయి శివం జంపాన దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోనాల్‌ హీరోయిన్‌. యువాన్స్‌ నాయుడు సమర్పణలో తెలుగు, కన్నడ భాషల్లో జె. మల్లికార్జున నిర్మించారు. నటులు దేవరాజ్, చంద్ర దేవరాజ్‌ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్‌ లోగోను లాంచ్‌ చేయగా, నటులు బెనర్జీ, కాశీ విశ్వనాథ్‌ ‘వైరం’ టీజర్‌ను విడుదల చేశారు.

దేవరాజ్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులు నన్నెంతో ఆదరించారు. హీరోగా వస్తున్న నా కుమారుడు ప్రణమ్‌ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు జె. మల్లికార్జున. ‘‘ఈ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు సాయి శివన్‌ జంపాన. ఈ చిత్రానికి సహనిర్మాత: శీలం త్రివిక్రమ్‌ రావు, అరిపిరాల కళ్యాణ్‌ శాస్త్రి, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: సామల భాస్కర్‌.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు