ధమాకా.. మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్‌ వస్తోంది : నిర్మాత

26 Dec, 2022 01:16 IST|Sakshi

– టీజీ విశ్వప్రసాద్‌   

‘‘ధమాకా’ కంప్లీట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. రవితేజ  ఎనర్జీని పూర్తిగా ఎక్స్‌ప్లోర్‌ చేస్తూ చేసిన మూవీ ఇది. సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధమాకా’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పై రూపొందిన ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహనిర్మాత. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.

ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్‌  మాట్లాడుతూ– ‘‘త్రినాథరావు, రచయిత ప్రసన్న కలిసి ‘ధమాకా’ కథ చెప్పారు. ఇది రవితేజగారికి బావుంటుందనుకున్నాం. గ్రాండ్‌గా నిర్మించాం. ‘ధమాకా’కి గ్రాండ్‌గా ఓపెనింగ్స్‌ వచ్చాయి. బీ, సీ సెంటర్ల నుంచి వచ్చే స్పందనను మేం ఊహించాం. అయితే మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ నుండి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన వస్తోంది. మా బ్యానర్‌ నుంచి ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్‌ని ఓటీటీలో విడుదల చేశాం. ప్రస్తుతం నాగశౌర్య – శ్రీనివాస్‌ అవసరాల ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, గోపీచంద్‌–శ్రీవాస్‌ కాంబినేషన్‌లో ‘రామబాణం’, లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్‌ ఉంది. కొన్ని పెద్ద చిత్రాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. 

మరిన్ని వార్తలు