f Annapoorna Photo studio: క్వాలిటీ ఫిల్మ్‌లా అనిపిస్తోంది

24 Jun, 2023 00:31 IST|Sakshi

చైతన్యా రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో యష్‌ రంగినేని నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఈ సినిమా జూలై 21న రిలీజ్‌ కానున్న సందర్భంగా శుక్రవారం టీజర్‌ను రిలీజ్‌ చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘1980, 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఆ నేటివిటీ ఎక్కడా మిస్‌ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్‌ చూస్తుంటే క్వాలిటీ ఫిల్మ్‌లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే మా చిత్రం భిన్నంగా ఉంటుంది’’ అన్నారు చెందు ముద్దు.

మరిన్ని వార్తలు