ఓ రచయిత ప్రయాణం

25 Jan, 2023 04:49 IST|Sakshi

– షణ్ముఖ ప్రశాంత్‌

‘‘రైటర్‌ పద్మభూషణ్‌’ హిలేరియస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. విజయవాడలోని ఓ మధ్య తరగతి యువకుడి కథ ఇది’’ అని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌ అన్నారు. సుహాస్, టీనా శిల్పరాజ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. జి. మనోహర్‌ సమర్పణలో అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా షణ్ముఖ ప్రశాంత్‌ మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో కథని అమ్మలానే చూస్తాను. ఎంత బడ్జెట్‌ పెట్టినా మొదట కంటెంట్‌ రాయాల్సింది రచయితనే. అలాంటి ఒక రచయిత ప్రయాణం ఈ చిత్రంలో ఉంటుంది. ఇందులో హీరో ΄ాత్ర పేరు పద్మభూషణ్‌. తను రైటర్‌ కావాలనుకుంటాడు. మరి అయ్యాడా? లేదా అనేదే కథ. దర్శకులు జంధ్యాల, ఈవీవీ, శ్రీను వైట్లగార్ల సినిమాలంటే ఇష్టం. నా బలం కూడా కామెడీనే. మా సినిమాలో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు