SS Rajamouli: ఖరీదైన బంగ్లా, ఆ కార్స్.. రాజమౌళి దగ్గర ఏమేం ఉన్నాయంటే?

10 Oct, 2023 17:03 IST|Sakshi

ఎస్ఎస్ రాజమౌళి.. ఇది పేరు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. వేలకోట్ల వసూళ్లని రుచి చూపించాడు. ఫ్లాప్ అనే పదాన్ని తన డిక్షనరీలో లేకుండా చేశాడు. టాలీవుడ్ స్టార్స్ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డుని తన మూవీతో సాధించాడు. అలాంటి రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబరు 10). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు ఆస్తులు ఎంత సంపాదించాడనేది చూద్దాం.

సీరియల్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి.. 'స్టూడెంట్ నం.1'తో సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి సరికొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చాడు. ఇక 'బాహుబలి'తో పాన్ ఇండియా లెవల్లో విధ్వంసం సృష్టించి, 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ రేంజుకి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు 12 సినిమాలు తీసిన రాజమౌళి.. దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస‍్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే!)

సినిమా ప్రమోషన్స్ తప్ప బయట పెద్దగా కనిపించని రాజమౌళికి హైదరాబాద్‌ మణికొండలోని ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. అలానే సిటీ చివర్లో ఫామ్ హౌస్ తో పాటు స్థలాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలానే పలు నగరాల్లో ఫ్లాట్స్ కూడా ఉన్నట్లు సమాచారం. అలానే సినిమా ప్రొడక్షన్‌ కూడా చేస్తున్నారట. ఇవన్నీ పక్కనబెడితే రాజమౌళి దగ్గర బీఎండబ్ల్యూ 7 సిరీస్, రేంజ్ రోవర్, వోల్వ్ తదితర ఖరీదైన కార్లు ఉన్నాయట. అలా ఓవరాల్ గా రూ.158 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. 

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అందనంత రేంజ్‌కి వెళ్లిపోయిన రాజమౌళి షారితోషికం మిగతా డైరెక్టర్స్‌తో పోలిస్తే చాలా ఎక్కువ. ఇదిలా ఉండగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో రాజమౌళి.. తర్వాతి సినిమా చేయబోతున్నాడు. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని అంటున్నారు. ఇదో జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ అని టాక్. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: సడన్‌గా హౌస్‌లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్‌!)

మరిన్ని వార్తలు