ఆర్‌ఆర్‌ఆర్ నుంచి దీపావళి సర్‌ప్రైజ్‌‌

13 Nov, 2020 13:03 IST|Sakshi

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌'(రౌద్రం రణం రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అలియాభట్‌, ఓలివియా మోరీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. చదవండి: రాజమౌళి చాలెంజ్‌ స్వీకరించారు

కాగా రేపు(శనివారం) దీపావళి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌(రణం, రుధిరం, రౌద్రం) చిత్ర యూనిట్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ట్విటర్‌ అకౌంట్‌లో శుక్రవారం రామ్‌ చరణ్‌, జూ ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి ముచ్చటిస్తున్న ఫోటోలను పోస్టు చేసింది. ఈ మేరకు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. అందరి జీవితాల్లో ఈ దీపావళి మరిన్ని వెలుగులు నింపాలని పేర్కొంది. ఈ ఫోటోల్లో ముగ్గురు సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇక దీపావళికి ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఏదైనా అప్‌డేట్‌ వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులు ఈ ఫోటోలు పోస్టు చేయడంతో ఖుషీగా ఫీల్‌ అవుతున్నారు. చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆ సీన్‌ తొలగించాల్సిందే
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా