Chiranjeevi Birthday Special: 'చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌' .. అలా ఏర్పాటైంది..

22 Aug, 2022 08:52 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.కష్టంలో ఉన్న బాధితులకు అండగా నిలబడటంలో ముందుటారాయన. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. అసలు ఈ బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలనే అలోచన ఎలా వచ్చింది? దీనికి గల కారణాలు ఏంటి అన్నదానిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ రోజు పేపర్‌ చదువుతుంటే, రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్త కనిపించింది.

ఇంతమంది జనం ఉండి కూడా సరైన సమయానికి రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఏంటి అన్న ప్రశ్న నన్ను ఎంతగానో తొలచివేసింది. దీంతో ఆ మరుసటి రోజు బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేశాను. అలా 1998లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ను స్థాపించాం. నా ప్రయత్నానికి ఎంతోమంది అభిమానులు సహా సామాన్యులు కదిలివచ్చారు.

అలా వారందరి సహకారంతో ఎంతో సక్సెస్‌ ఫుల్‌గా బ్లడ్‌ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నాం. సినిమా స‌క్సెస్ అయిన‌ప్ప‌టి కంటే ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకున్న‌పుడు క‌లిగే సంతృప్తి చాలా గొప్ప‌ది. ఆ రోజు ప్ర‌శాంతంగా నిద్ర‌పోతాం. బ్ల‌డ్ బ్యాంక్ స్థాపించడానికి కార‌ణ‌మిదే అని వెల్లడించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు