విచారణకు హాజరు కావాలంటూ నోరాకు ఈడీ నోటీసులు

14 Oct, 2021 11:56 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ నోరా ఫతేహి ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌(ఈడీ) షాక్‌ ఇచ్చింది. రూ. 200 కోట్ల మనిలాండరింగ్‌ కేసులో తాజాగా ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సుకేష్‌ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసు నేపథ్యంలో ఆమెకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించింది. కాగా ఇప్పటికే ఈ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. 

కాగా 2017 ఎలక్షన్స్‌లో కమిషన్‌కు ఇచ్చిన లంచం కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్‌ని విచారించగా పలువురి పేర్లు బ‌య‌ట‌పడ్డాయి. అందులో బాలివుడ్ బ్యూటీ జాక్వెలిన్ పేరు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తీహార్ జైలు లోపల నుంచే దాదాపు 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడుపుతున్నట్టు చంద్రశేకర్ పై ఆరోపణలున్నాయి. గతంలో జాక్వెలిన్‌ను ఈ కేసులో ప్రశ్నించిన ఈడీ మొదట ఆమె ప్రమేయం ఉందని భావించింది. ఆ తర్వాత విచారణలో జాక్వెలిన్‌ ఈ కేసులో బాధితురాలిగా అధికారులు తేల్చారు. సుకేష్ చంద్రశేఖర్‌ ఆయన భార్య లీనా పాల్ ద్వారా జాక్వెలిన్‌ను మోసం చేశాడని, జాక్వెలిన్‌ తన మొదటి స్టేట్‌మెంట్‌లో ఈడీకి సుకేష్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన సమాచారాన్ని అందించినట్లుగా తెలిసిందే.

మరిన్ని వార్తలు