Global Handwashing Day 2021: కరోనాకు చెక్‌ పెడదాం

14 Oct, 2021 11:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసంఅంతా కాదు. లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్న  ఈ కరోనా మన దరికి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఒక్కటే మార్గం. ముఖ్యంగా ముఖానికి మాస్క్‌ ధరించడంతోపాటు ఎల్లవేళలా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా కష్టకాలంలో పెద్ద నగరాలు, మారు మూల పల్లెల దాకా పెద్దలతో పాటు చిన్నారుల కూడా దీనిపై అవగాహన పెంచాలంటున్నారు నిపుణులు. ఫలితంగా అనేక  ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.  అక్టోబరు 15  గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే  సందర్భంగా.. స్పెషల్‌ స్టోరీ.

గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే 2021 థీమ్ : 2008 లో తొలిసారిగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే జరిగింది. ప్రతీ సంవత్సరం, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ "మన భవిష్యత్తు  మన చేతుల్లో- కలిసికట్టుగా ముందుకు సాగుదాం’’. 

జాతీయ ఆరోగ్య మిషన్ డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది పిల్లలు అతిసారం కారణంగా మరణిస్తున్నారు. హ్యాండ్ వాష్ చేయడం వల్ల డయేరియా మరణాల రేటును 40 శాతానికి పైగా తగ్గించవచ్చు: యునిసెఫ్

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు