దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ మృతి: ఫర్హాన్‌ అక్తర్‌ భావోద్యేగం

19 Jun, 2021 15:31 IST|Sakshi

పరుగుల వీరుడు, ఫ్లయింగ్‌ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌(91) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు  మహమ్మారితో పోరాడిన ఆయన ఇటీవల కోలుకున్నారు. ఈ క్రమంలో కరోనా సంబంధిత సమస్యలతో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త దేశం మొత్తాన్ని విషాదంలో నింపింది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు ఆయన మృతివకి సంతాపం ప్రకటిస్తున్నారు. 

అలాగే బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ మిల్కా సింగ్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్యేగానికి లోనయ్యాడు. కాగా ఆయన జీవిత కథ ఆధారంగా ‘బాగ్‌ మిల్కా బాగ్‌’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లీడ్‌రోల్‌ల పోషించిన అక్తర్‌ అచ్చం ఆయనలా అనుసరించి ఈ పాత్రలో జీవించాడు. 2013లో వచ్చిన ఈ చిత్రం బి-టౌన్‌కు బాక్‌బ్లస్టర్‌ హిట్‌ను అందించింది. ఈ సందర్భంగా ఈ మూవీ సమయంలో మిల్కా సింగ్‌తో ఉన్న  జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫర్హాన్‌ ఎమోషనల్‌ పోస్టు షేర్‌ చేశాడు.  

అతడు ట్వీట్‌ చేస్తూ ‘మీరు లేరని వార్తను నేను ఇంకా నమ్మలేక పోతున్న. లోలోపల ఏదో అవుతోంది. నా మనసు ఇంకేదో చెబుతుంది. మీరు భౌతికంగా మాకు దూరమయ్యారు. కానీ నిజం ఏంటంటే మీరేప్పుడూ మా మధ్యే ఉంటారు. ఓ ఐడియా, కలలకు మీరోక ప్రతినిధి.  ప్రతి ఒక్కరిని ప్రేమించే పెద్ద మనసున్న గొప్ప వ్యక్తి మీరు. డౌన్‌ టూ ఎర్త్‌ పర్సన్‌. ఓ తండ్రిగా, స్నేహితుడిగా మీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులు.  మీరు ఎంతో మందికి స్ఫూర్తి. మీరు మా హీరో. నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను సార్‌’ అంటూ ఫర్హాన్‌ రాసుకొచ్చాడు. కాగా ఫర్హాన్‌తో పాటు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, షారుక్‌ ఖాన్‌, ప్రియాంక చొప్రా తదితరులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు మృతికి సంతాపం తెలుపుతున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు