మీసకట్టు, కళ్లలో పౌరుషం లుక్‌ అదిరింది..చెర్రీపై బాలీవుడ్‌ ప్రశంసలు

4 Aug, 2021 15:14 IST|Sakshi

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్ర ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంలో ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాదు యావత్ భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చిన అది సంచలనంగా మారుతుంది.ది. ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ రామ్‌ చరణ్‌పై టీజర్ వదిలినా.. ఆ తర్వాత మధ్యలో కొన్ని పోస్టర్లు ఇచ్చి.. ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ ఎన్టీఆర్‌పై టీజర్ వదిలిన అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటి మధ్యలో వచ్చిన ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్‌ల ఫస్ట్‌లుక్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ‘దోస్తీ’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటని చిత్ర యూనిట్ స్నేహితుల దినోత్సవం రోజున విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు కీరవాణి సంగీతం సమకూర్చారు.

ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లు ఈ పాటను పాడారు. అయితే తాజాగా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా.. ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ‘‘ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది. ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉంటుందనిపిస్తోంది.’’ అంటూ రాహుల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు