షారుక్ ఖాన్‌ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా?

7 Dec, 2023 20:12 IST|Sakshi

భారతీయ మార్కెట్లో 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ తన 'ఐయోనిక్ 5' (Ioniq 5) ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించినప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియుల మనసు దోచేసింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌ కూడా ఈ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గత 20 సంవత్సరాలుగా హ్యుందాయ్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న షారూఖ్ ఖాన్‌కు కంపెనీ 'ఐయోనిక్ 5' 1100వ యూనిట్‌ను డెలివరీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ఐయోనిక్ 5 ఈవీ లాంచ్ సమయంలో కూడా షారుక్ పాల్గొన్నారు.

ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న షారుక్ ఖాన్‌ గ్యారేజిలో చేరిన మొదటి ఎలక్ట్రిక్ కారు 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' కావడం గమనార్హం. మొదటి సారి గ్యారేజిలో ఎలక్ట్రిక్ కారు చేరటం ఆనందంగా ఉందని, అందులోనూ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు చేరటం మరింత సంతోషంగా ఉందని షారుక్ వెల్లడించారు.

భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఒక ఫుల్ ఛార్జ్‌తో 630 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు 350 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. హ్యుందాయ్ ఐయోనిక్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇదీ చదవండి: తుఫాన్ ప్రభావం.. కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఆటోమొబైల్ కంపెనీలు

షారూఖ్ ఖాన్ ఇతర కార్లు
ప్రపంచంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుల జాబితాలో ఒకరైన షారుక్ అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద ఉన్న కార్లలో బెంట్లీ కాంటినెంటల్ GT, రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్, బుగట్టి వేరాన్ స్పోర్ట్స్‌, ఆడి A6, రేంజ్ రోవర్ వోగ్, హ్యుందాయ్ క్రెటా వంటివి మరెన్నో ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు