యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హ్యాపీ వీకెండ్‌’ ఫస్ట్‌లుక్‌ అవుట్‌

1 Sep, 2022 21:09 IST|Sakshi

వినాయక చవితి పండగ సందర్భంగా తాజా చిత్రం ‘హ్యాపీ వీకెండ్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌. యూత్‌ఫుల్‌ నటీనటులతో శ్రీసారిక మూవీస్‌ పతాకంపై కారాడి వెంకటేశ్వర్లు స్వీయ నిర్మాణ-దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సిని​మాకు రాధాకృష్ణ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజా మూడవ షెడ్యూల్‌ కోసం చిత్రం బృందం గోవా పయనమైంది. ఈ క్రమంంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.  

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఒక హారర్ కామెడీ చిత్రంగా హ్యీపీ వీకెండ్‌ను తెరకెక్కిస్తున్నాం. చింతా పృద్వి చరణ్, చంద్రదిత్య, భాస్కర శర్మ, హర్ష నల్లబెల్లి, యాష్‌, రూప, కావ్య కీర్తి, గౌతమి లాంటి యూత్ ఫుల్ నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. కథ కథనం చాలా కొత్తగా ఉంటుంది. యూత్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వారి మంచి వినోదం అందించేందుకు ఈ చిత్రాన్ని మంచి హారర్‌ కామెడీగా నిర్మిస్తున్నాం. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం’’అని తెలిపారు.

మరిన్ని వార్తలు