దుబాయ్‌లో గామా అవార్డ్స్‌ 

20 Dec, 2023 00:41 IST|Sakshi

‘‘దుబాయ్‌లో మార్చి 3న ‘గల్ఫ్‌ తెలుగు సినీ అవార్డ్స్‌’ (గామా అవార్డ్స్‌) వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం’’ అని ‘గామా’ అవార్డ్స్‌ చైర్మన్‌ కేసరి త్రిమూర్తులు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ– ‘‘2024 మార్చి 3న నిర్వహించనున్న గామా అవార్డ్స్‌లో అల్లు అర్జున్‌కి ‘గామా నేషనల్‌ ఐకాన్‌ అవార్డ్‌’ అందిస్తాం. 2021, 2022, 2023 సంవత్సరాల్లోని ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకులు, సంగీతం.. వంటి విభాగాల్లో ఈ అవార్డ్స్‌ అందజేస్తాం’’ అన్నారు.

‘‘ఈ అవార్డు వేడుకకు పలువురు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సంగీత దర్శకులు హాజరవుతారు’’ అన్నారు ‘గామా’ అవార్డ్స్‌ జ్యూరీ సభ్యుడు, గౌరవ సలహాదారుడు, దర్శకుడు వీఎన్‌ ఆదిత్య. ‘‘గామా అవార్డ్స్‌ ఆస్కార్‌ స్థాయికి చేరుకోవాలి’’ అన్నారు జ్యూరీ చైర్మన్, సంగీత దర్శకుడు కోటి. ‘‘గామా’ అవార్డ్స్‌ దర్శకుడు ప్రసన్న పాలంకి, జ్యూరీ సభ్యురాలు, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు