'నాని' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఇప్పుడెలా ఉందో తెలిస్తే

9 Dec, 2023 10:53 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా అయిన ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో హీరో నాని ఒక సినిమా చేశారు. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేసింది. విక్రమ్ కుమార్  డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో ఐదుగురు మహిళలు ఒక గ్రూప్‌గా ఉంటారు. కానీ వారందరూ కూడా సేమ్‌ గ్రూప్‌ ఏజ్‌ కాకుండా ఒక్కొక్కరిది ఒక్కో వయసు చిన్న పాప దగ్గర నుంచి బామ్మ వరకు ఉంటారు. వారిలో 'శ్రియ రెడ్డి కొంతం' అనే అమ్మాయి అందరినీ ఆకట్టుకుంది.

అప్పట్లోనే ఆ అమ్మాయి ఎవరా అని చాలా మంది ఆరా తీశారు. సినిమా విడుదల సమయంలో ఆమె ఎక్కడా కూడ ఆప్రమోషన్‌లో పాల్గొనలేదు. సినిమా షూటింగ్‌ పూర్తి కాగానే ఆమెరికా వెళ్లిపోయింది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గ్యాంగ్‌ లీడర్‌ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని సాధరణంగా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు ఇలా హాట్‌ ఫోటోలతో మళ్లీ వైరల్‌ అవుతుంది.,హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన శ్రియ కొంతం ఇంటర్మిడియట్ తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. 

ఆమెకు సినిమాలపై మక్కువ ఉండటంతో అప్పుడప్పుడు కొన్ని ఆడిషన్స్‌లలో పాల్గొనేది. తనకు 12 ఏళ్ల వయసులోనే విజయదేవర కొండతో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా నటించానని చెప్పింది. తాను ఇంటర్ చదవుతున్నప్పుడు శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్ చేస్తుండగా.. అక్కడ ఒక కోఆర్డినేటర్ తనను చూసి దర్శకుడు విక్రమ్ కుమార్‌కు రిఫర్‌ చేస్తే అలా నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో ఛాన్స్‌ దక్కినట్లు చెప్పింది. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రియ కొంతం ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

A post shared by Shriya Kontham (@shriya.kontham)

>
మరిన్ని వార్తలు