Hebah Patel : హెబ్బా పటేల్‌ 'బ్లాక్‌ అండ్‌ వైట్‌' టీజర్‌ అవుట్‌

28 Oct, 2022 13:03 IST|Sakshi

కుమారి 21ఎఫ్‌ ఫేం హెబ్బా పటేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం బ్లాక్‌ అండ్ వైట్‌ (Black and white). ఎన్‌ఎల్‌వీ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్‌ విడుదల చేశారు. ‘‘నో కమిట్‌మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్‌తో టీజర్‌ షురూ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు