-
బ్లాక్ అండ్ వైట్ చీరలో పరిణితి హోయలు..ధర ఎంతంటే?
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటి. ఆమె నటనకు గాను ఫిల్మ్‌ఫేర్, నేషనల్ ఫిల్మ్ ఫేర్ వంటి అవార్డు అందుకుంది. 2013లో ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది. ఇటీవలే ఆమ్ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ చద్దాని పెళ్లి చేసుకుని వివాహం బంధంలో అడుగుపెట్టింది. అయినప్పటికీ కెరీర్ పరంగా దూసుకుపోతుంది పరిణితి. తన మూవీ చమ్కిలా మూవీ ప్రమోషన్లో భాగంగా పరిణితి బ్లాక్ అండ్ వైట్ చీరలో గ్లామరస్ లుక్‌లో సందడి చేసింది. ఎంబ్రాయిడరీతో కూడిన బ్లాక్ అండ్ వైట్ చీరలో సౌందర్యం అంతా ఆమెలోనే దాగుందా అన్నంత ఆకర్షణగా ఉంది. ఆ ఎంబ్రాయిడరీ చీరకు తగ్గట్టు హై నెక్బ్లౌజ్ జత చేయడం ఆమెకు మరింత అందాన్నితెచ్చి పెట్టింది . పూలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన బ్లాక్ అండ్ వైట్ ఆరు గజాల చీర ఆమె అందాన్ని రెట్టింపు చేసేలా మరింత అందంగా ఉంది పరిణితి. చాలా సింపుల్‌గా జస్ట్ చెవులకు మాత్రమే డైమెండ్లతో కూడిన చెవిపోగులు పెట్టుకుంది. లైట్ మేకప్‌తో కళ్లను హైలెట్ చేసేలా స్మోకీ ఐషాడో వేసుకుంది. హెయిర్‌ని ప్రీగా వదిలేసింది. ఇక ఇక్కడ పరిణితీ ధరించి చీర ప్రముఖ శ్రియా ఖన్నా బ్రాండ్‌కి చెందింది. ఈ బ్రాండ్ చీరలన్ని సంప్రదాయం ఉట్టిపడేలా చక్కటి ఎంబ్రాయిడర్‌తో హుందాగా ఉంటాయి. వాటి ధర రూ. 30 వేలు దాక పలుతుంది. View this post on Instagram A post shared by @parineetichopra (చదవండి: గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
‘బ్లాక్ అండ్ వైట్’ మూవీ రివ్యూ
టైటిల్: బ్లాక్ అండ్ వైట్ నటి నటులు: హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి శరీ, నవీన్ నేని తదితరులు నిర్మాణ సంస్థలు: ఏ యు & ఐ స్టూడియోస్ నిర్మాత: పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి దర్శకుడు: ఎల్ యెన్. వి సూర్య ప్రకాశ్ సంగీతం: అజయ్ అర్రసాడ సినిమాటోగ్రఫీ: టి.సురేంద్ర రెడ్డి విడుదల తేది: ఏప్రిల్ 14, 2023 తొలి సినిమా (కుమారి 21 ఎఫ్)తోనే సక్సెస్‌ని చూసింది హెబ్బా పటేల్. ఆ క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే ఒకానొక దశలో ఆమె వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. ఆ తరువాత కథానాయికగా వెనుకబడిన ఆమె, ఐటమ్ సాంగ్స్ లోను మెరిసింది. ఈ మధ్య కాలంలో తెరపై ఆమె కనిపించలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు 'బ్లాక్ అండ్ వైట్' సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘బ్లాక్ అండ్ వైట్’ కథేంటంటే... వర్ధన్(సూర్య శ్రీనివాస్), స్వరాంజలి(హెబ్బా పటేల్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. మూడేళ్ల పాటు కలిసి సహజీవనం చేస్తారు. అయితే ఓ రోజు ‘జాను’ అనే అమ్మాయి నుంచి వర్దన్కి మెసేజ్వస్తుంది. అది చూసి స్వరాంజలి అతనితో గొడవ పడుతుంది. కోపంలో అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు జాను ఎవరు? వర్దన్‌కు వచ్చిన మెసేజ్‌లో ఏం ఉంది? వర్ధన్ ని చంపినా స్వరాంజలి జైలు కి వెళ్లిందా? పప్పువా(నవీన్ నేని) ఎందుకు ‘స్వరాంజలి’ హౌస్ చుట్టూ తిరుగుతుంటాడు? అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రేమలో పడటం .. మోసపోవడం .. అందుకు ప్రతీకారం తీర్చుకోవడం..ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ తరహా చిత్రమే. కపోతే, దర్శకుడు ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న కథ చూపించిన విధానం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో ఇంకాస్త గ్రిప్పింగ్ ఉంటే బాగుండేది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ టచ్ ఇంకాస్త పెంచితే బాగుండేదేమో. సినిమాలో అక్కడక్కడ ‘వర్ధన్’ భయపెట్టించే కొన్ని సీన్స్ రక్తి కట్టిస్తాయి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయ్యితే, క్లైమాక్స్ లో స్టేషన్ దగ్గర వచ్చే ట్విస్ రివీల్ చేసిన విధానం అదిరిపోతుంది. స్వరాంజలి కి ఎంతో ఇష్టమైన పెయింటింగ్ లైవ్ విజ్యువల్స్ బాగుంటాయి. ఎవరెలా చేశారంటే.. మల్టీపుల్ షేడ్స్ ఉన్న స్వరాంజలి పాత్రకు హెబ్బా పటేల్ న్యాయం చేసింది. మునుపెన్నడు చూడని హెబ్బాను చూస్తారు. బిగ్ బాస్ ఫెమ్ ‘లహరి తనదైన యాక్టింగ్ ముద్ర వేసుకుంటూనే ముఖ్య పాత్ర పోషించింది. ‘సూర్య శ్రీనివాస్’ ఫ్లాష్ బ్యాక్ వెర్షన్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తునే ప్రెజెంట్ లో భయపెట్టించిన వేరియేషన్ బాగుంది. నవీన్ నేని పాత్రను సరిగ్గా స్క్రీన్ మీద ఉపయోగించలేకపోయినప్పటికీ యాక్టింగ్ లో బాగానే రాణించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. డైరెక్టర్ ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ కథ, కాస్టింగ్ ఎంచుకున్న తీరు బాగుంది. కాకపోతే, కథ ని చెప్పడంలో కాస్త ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. అజయ్ అర్రసాడ నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు పర్వాలేదు. టి.సురేంద్ర రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
హెబ్బా పటేల్ 'బ్లాక్ అండ్ వైట్' టీజర్ అవుట్
కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం బ్లాక్ అండ్ వైట్ (Black and white). ఎన్‌ఎల్‌వీ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘నో కమిట్మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్‌తో టీజర్ షురూ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
సునయన నుంచి అక్షర హాసన్ వరకూ..
సవ్యంగా సాగుతున్న జీవితాల్లో ఊహించిన మలుపులా దూసుకొచ్చింది కరోనా వైరస్. ఎంతో మంది జీవితాలను ఈ మహమ్మారి అతాలకుతలం చేసింది. కరోనా ధాటికి అనేక పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిలో సినీ పరిశ్రమ ఒకటి. కొన్ని కొత్త సినిమాలు ఆరంభంలోనే ఆగిపోతే మరి కొన్ని షూటింగ్ మధ్యలో నిలిచిపోయాయి. ఇక అనేక సినిమాలు విడుదలకు నోచుకోక వాయిదా పడ్డాయి. పని లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో కొత్త ఫిట్నెస్, వంటలు, కొత్త వ్యాపకాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తమ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. (సోనూసూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?) ఈక్రమంలో కొన్ని ఛాలెంజ్‌లను స్వీకరిస్తున్నారు. అలా వచ్చిందే ‘బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్’. ఎప్పుడూ కలర్ ఫుల్ ఫోటోలే కాకుండా నలుపు, తెలుపు రంగులో ఉండే ఫోటోలను womensupportingwomen అనే హ్యష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఈ ఛాలెంజ్. దీని ద్వారా మహిళలు తమలోని ఆత్మ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, మహిళా సాధికారికతను పెంపొందించే ఉద్ధేశ్యంతో ఈ ఛాలెంజ్ నడుస్తోంది. ఈ సవాల్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన కోలీవుడ్ తారలపై ఓ లుక్కేద్దాం. (పెళ్లికి రెడీ అవుతోన్న 'పహిల్వాన్' విలన్) 1... సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎంచుకున్న పాత్రల్లో తన అద్భుతమైన నటన నైపుణ్యాలను నిరూపించుకుంది. తన స్నేహితురాలు, నటి మంజిమా మోహన్ ఇచ్చిన సవాలును అంగీకరించిన సునాయన బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని పంచుకుంది. సునైనా సాదా చీరతో, తక్కువ అభరణాల అలంకరణ ఆమెకు సరిగ్గా సరిపోయింది. 2. మంజిమా మోహన్ తమిళ నటుడు శింబు సరసన రొమాంటిక్ థ్రిల్లర్ 'అచ్చం యెన్భాధు మదమైయాడ' చిత్రంలో నటించిన మంజిమా మోహన్ తన నటనకతో ప్రేక్షకులలో మంచి ఆదరణ సంపాదించుకుంది.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలతోపాటు పరిశ్రమలో మంచి స్నేహితులను కూడా సంపాదించింది. నటి వరలక్ష్మి చేసిన సవాలును అంగీకరించిన మంజిమా బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో ఫోటోను షేర్ చేసింది. 3. వరలక్ష్మీ సినీ పరిశ్రమలో ధైర్యవంతులైన నటీమణులలో వరలక్ష్మి ఒకరు. ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టదినట్లు మాట్లడటంలో ఆమె ఎన్నడూ వెనకాడదు. మహిళలపై లైంగిక వేధింపుల కోసం పోరాడటానికి వరలక్ష్మి ఒక ప్రచారాన్ని కూడా నడుపుతుంది. తాజాగా ఈ సవాలను స్వీకరించిన వరలక్ష్మీ బ్లాక్ అండ్ వైట్‌లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేగాక లాక్ డౌన్ సమయంలో ఆమె బరువు తగ్గినట్లు తెలుస్తోంది. 4. నివేధిత సతీష్ 'మాగలీర్ మాట్టం', 'సిల్లు కరుపట్టి' వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాలలో నివేదిత సతీష్ తన పాత్రలతో అబ్బురపరిచింది. బోల్డ్ పాత్రలు స్వీకరించే నటీమణులలో నివేదిత ఒకరు. ఆమెకున్న పెద్ద కళ్ళు తనకు ప్లాస్ పాయింట్‌గా చెప్పుకుంటారు. ఆమెకు బాగా సరిపోయే చీరతో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను అభిమానులతో పంచుకుంది. 5. సుజా వరుణీ సుజా వరుణీ 2018లో శివ కుమార్‌ను వివాహం చేసుకున్నారు, ఈ జంటకు గత ఏడాది (2019) ఆగస్టులో పండంటి మగబిడ్డ జన్మించాడు. సుజా వరుణీ అనేక పాపులర్ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించింది, అయితే టెలివిజన్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ఈ నటికి మరింత ఖ్యాతి వచ్చింది. మహిళల ఛాలెంజ్‌కు మద్దతు ఇచ్చే మహిళల్లో సుజా వరుణీ ఒకరు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించిన, ఆమెతన గతంలో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పంచుకున్నారు. 6.. అక్షర హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్. అయితే వారసత్వ నటిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం నవీన్ దర్శకత్వం వహించే 'అగ్ని సిరగుగల్' చిత్రంలో అక్షర ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం తమిళ సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సవాలును స్వీకరించిన అక్షర బ్లాక్ అండ్ వైట్‌లో ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. -
చారడేసి అందం
చెట్టు మీద కాయ సముద్రంలో ఉప్పు వేరు వేరు అయినా కలిపితే వచ్చే రుచి వేరు తెలుపు, నలుపు ఎదురెదురు రంగులయినా కలిపితే వచ్చే సొగసు వేరు తెలుపు, నలుపులకు నాలుగు చారలు వేసి చారడేసి అందంతో వనితలను మెరిపిస్తున్నారు ఈ జంట డిజైనర్లు. అబ్రహమ్, ఠాకూర్ల ఎక్స్‌క్లూజివ్ డిజైన్స్ ఇవి.ప్రత్యేక డిజైన్లు ఫ్యాషనబుల్ దుస్తులతో పాటు బ్యాగ్, షూ, బెల్ట్.. వంటి ఇతర అలంకరణ వస్తువుల డిజైనింగ్‌లోనూ డేవిడ్ అబ్రహం, రాకేష్ ఠాకోర్లది విజయవంతమైన ప్రయాణం. దాదాపు పాతికేళ్లుగా వీళ్లు ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అహ్మదాబాద్ ఫ్యాషన్ ఇన్ట్సిట్యూట్‌లో పట్టభద్రులైన ఈ డిజైనర్లు న్యూఢిల్లీలో అ–ఖీ బ్రాండ్‌ను ప్రారంభించారు. వీరి డిజైన్లు ప్రముఖంగా యూరప్‌లో పేరు గడించాయి. అంతర్జాతీయ డిజైన్లు అయినప్పటికీ భారతీయ మూలాలు వీరి వస్త్రశైలులో కనువిందు చేయడం విశేషం. లగ్జరియస్‌గా కనిపించే వీరి డిజైన్లు పదేళ్ల కిందట ఇండియా ఫ్యాషన్ వీక్‌లో మొదటిసారి మెరిసాయి. నలుపురంగు హ్లాండ్లూమ్ శారీని మోకాళ్ల కిందవరకు కట్టి, పైన బెల్ట్‌తో అలంకరించారు. ‘భారతీయ సంప్రదాయ వస్త్రధారణను ప్రపంచ వేదికపైన ప్రదర్శించి ఒక కొత్త ఆత్మస్థైర్యాన్ని చూపాలనుకున్నాం. ఆ డిజైన్ చూసి మొదట చాలా మంది ఆశ్చర్యపోయారు ఫ్యాషన్ షోలో శారీ ఏంటని’ అంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ఈ జంట డిజైనర్లు. ప్రతియేటా ప్రఖ్యాత ఫ్యాషన్‌షోలలో పాల్గొంటూ తమ వస్త్ర శైలులను ప్రదర్శిస్తున్నారు. ఈ సంవత్సరం లాక్మే ఫ్యాషన్ వీక్ 2019లో నలుపు, తెలుపు, చారల కాంబినేషన్లో తమ స్టైల్ డిజైన్ దుస్తులను ప్రదర్శించారు అబ్రహమ్, ఠాకోర్‌లు. అయితే, వీరి చారల డిజైన్లు ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్స్‌ను పోలి ఉంటాయి అనే విమర్శ కూడా ఉంది. అందుకు అబ్రహం మాట్లాడుతూ ‘ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. అందులో నుంచి ప్రతి డిజైనర్ స్ఫూర్తి పొందుతారు. కానీ, ఎవరి ప్రత్యేకత వారిదే’ అని వివరణ ఇస్తారు.నిర్వహణ– నిర్మలారెడ్డి ఏ దేశంలోనైనా వినియోగదారుడి ఫ్యాషన్ ఆలోచనలు అతి వేగవంతంగా మారుతుంటాయి. అయినా వారి కళ్లను కట్టడి చేసే డిజైన్లను సృష్టించడంలో డిజైనర్లు ఎప్పుడూ ముందుండాలి. ఆ ప్రత్యేకత కోసం చాలా వర్క్ చేశాం. దాంట్లో ఈ నలుపు, తెలుపు, చారల కాంబినేషన్ ఫ్యాషన్‌లో గిరిగీసుకున్న హద్దులను చెరిపేసింది. అంతర్జాతీయంగా మంచి మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో భారత ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఎలాంటి హద్దులు లేవు అని నిరూపించింది.– అబ్రహమ్, ఠాకూర్, ఫ్యాషన్ డిజైనర్లు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement