Nikhil Siddhartha : మనకి ఆస్కార్‌ అవసరమా? నా ఫీలింగ్‌ అయితే అదే!. నిఖిల్‌ కామెంట్స్‌ వైరల్‌

23 Sep, 2022 12:43 IST|Sakshi

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. రాజమౌళి దర్శ​కత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్‌, కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. పాన్‌ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ అవుతుందని అంతా భావించారు.

కానీ చివరకు నిరాశే మిగిలిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ని ఆస్కార్‌కి నామినేట్‌ చేయకుండా చెల్లో షో అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్‌ చేశారు. దీనిపై హీరో నిఖిల్‌ స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఆస్కార్‌ అవసరమా? నాకు ఆస్కార్‌పై వేరే అభిప్రాయం ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆదరించారు. అదే సినిమాకు అతిపెద్ద విజయం అలాంటప్పుడు ఇంక ఆస్కార్‌ ఎందుకు? మనకు ఫిల్మ్‌ఫేర్‌, జాతీయ అవార్డులు ఇలా చాలానే ఉన్నాయి.

నేనైతే ఆస్కార్‌కి అంత ప్రాధాన్యత ఇవ్వను. ఇటీవలె స్పెయిన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశాను. అక్కడ థియేటర్స్‌ అన్ని హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాను ఇంతలా ఆదరిస్తుంటే, ఇంక ఆస్కార్‌ అవసరం లేదని నా ఫీలింగ్‌ అని నిఖిల్‌ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు