కరోనా ఎఫెక్ట్‌ : తన ఫ్యాన్స్‌ కోసం సూర్య ఏం చేశాడంటే...

10 Jun, 2021 12:04 IST|Sakshi

మరోసారి గొప్ప మనసు చాటుకున్న హీరో సూర్య

చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర సంక్షబాన్ని మిగిల్చింది. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభిమానులకు సహాయం చేసేందుకు కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ముందుకు వచ్చారు. తరుచూ ఫ్యాన్స్‌ను కలిసే సూర్య వారి కష్టాలను చూసి చలించిపోయారు. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్‌ క్లబ్‌కు చెందిన 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5000 చోప్పున మొత్తం రూ.12.5లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఇక సూర్య తన అభిమానుల పట్ల చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూర్య మంచి మనసుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

గత కొద్దిరోజలు క్రితమే కరోనాపై పోరాటానికి తమిళనాడు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తన తండ్రి, సోదరుడు కార్తీతో కలిసి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ఆకాశమే నీ హద్దురా సినిమాతో భారీ హిట్టు కొట్టిన ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే  ఈ సినిమా చిత్రీకరణ 35 శాతం పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారట. ఈ సినిమా కాకుండా వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడీవాసల్‌’, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమాలు కమిట్‌ అయ్యారు సూర్య. 

చదవండి : తాళి కట్టేముందు 'రిషి' అడిగిన ప్రశ్నకు ఇప్పటికీ ఏడిపిస్తుంటాను..
వైరల్‌: అభిమాని పెళ్లిలో సూర్య సందడి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు