Anjali Patil: యాక్సిడెంటల్‌ యాక్ట్రెస్‌.. శ్రీలంకన్‌ చిత్రంలో తొలి ఛాన్స్‌

15 May, 2022 08:31 IST|Sakshi

ఈ ఫొటోలోని నటిని చూడగానే ఓ తెలుగు సినిమా గుర్తొచ్చుండాలి కదా! అవును..మీరనుకుంటున్నది కరెక్టే.. ‘నా బంగారు తల్లి’ సినిమానే! ఆమె పేరు అంజలి పాటిల్‌. నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఆమే ఓ చిరునామా! ఇటు సిల్వర్‌ స్క్రీన్‌.. అటు వెబ్‌ స్క్రీన్‌.. రెండింటిలోనూ తన అప్పియరెన్స్‌ను స్థిరం చేసుకుంది.  మరిన్ని వివరాలు..

► అంజలి పుట్టింది, పెరిగింది మహారాష్ట్రలోని నాసిక్‌లో. పుణె యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌లో గోల్డ్‌మెడల్‌ అందుకుంది. తర్వాత ఢిల్లీ, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (ఎన్నెస్‌డీ)లోనూ చేరి దర్శకత్వంలో  శిక్షణ పొందింది. 

 మన దేశంలో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చిన సినిమా ‘డెల్హీ ఇన్‌ ఎ డే’. దీంతో ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది. 

  అయితే కమర్షియల్‌ సక్సెస్‌ను ఇచ్చిన చిత్రం మాత్రం ప్రకాశ్‌ ఝా ‘చక్రవ్యూహ్‌’. ఇందులో ఆమె మావోయిస్ట్‌ నేత జుహూగా నటించింది. ఈ సినిమా తర్వాత వరుసగా అన్నీ అలాంటి పాత్రలే రావడంతో అన్నిటినీ తిరస్కరించింది. 

 ఎన్నెస్‌డీలో ఉన్నప్పుడే అంజలి నటనా కౌశలం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తొలి సినిమా అవకాశం కూడా విదేశాల నుంచే వచ్చింది. అది శ్రీలంకన్‌ చిత్రం.. విత్‌ యూ.. వితవుట్‌ యూ (దర్శకుడు  ప్రసన్న విథంజే). అన్నట్టు అంజలి బౌద్ధమతాన్ని  పాటిస్తుంది.

  అంజలి నటే కాదు.. నిర్మాత కూడా..‘గ్రీన్‌ బ్యాంగిల్స్‌’ అనే మూవీతో. 

  సినిమా తెర మీదే కాదు ‘మై డియర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’, ‘మై క్లయింట్‌ వైఫ్‌’, ‘మేరీ నిమ్మో’, ‘కౌన్‌ ప్రవీణ్‌ తాంబె’ వంటి వెబ్‌ మూవీస్‌లోనూ తన అద్భుతమైన నటనను ప్రదర్శించింది. 
    పుస్తకాలు, ప్రయాణాలంటే ఇష్టం. నిజానికి నేను నటిని కావాలని అనుకోలేదెప్పుడు. నేను శిక్షణ తీసుకుంది కూడా దర్శకత్వంలో. యాక్సిడెంటల్‌గా యాక్ట్రెస్‌నయ్యాను.
– అంజలి పాటిల్‌ 

మరిన్ని వార్తలు