హోలీగా..జాలీగా..నితిన్‌ బర్త్‌డే వేడుక

27 Mar, 2021 15:19 IST|Sakshi

 ప్రముఖ వినోద చానెల్‌ జీ తెలుగు హోలీ పండుగ సంబరాలను వినూత్నంగా నిర్వహిస్తోంది. హ్యాపీ మూడ్‌లో ఉండే వీక్షకుల ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోంది. దీనిలో భాగంగా రంగ్‌ దే ప్రేమ పేరుతో సాయంత్రం 6గంటలకు ప్రసారం చేసే హోలీ ఈవెంట్‌లో హీరో నితిన్‌ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. అదే సమయంలో ఆయన తన పుట్టినరోజు వేడుకలు కాస్త ముందస్తుగా (మార్చి 30) నిర్వహిస్తుండడం విశేషం. అంతేకాకుండా హోలీ సందడికి ఊపునిస్తూ ‘తెల్లవారితే గురువారం’ సినిమా నటీ నటులు కూడా ఇందులో పాల్గొననున్నారు.

ఇక జీ కుటుంబంలో హిట్‌ పెయిర్‌గా పేరొందిన జంటలు... అషికా–చందు, అనుష–ప్రతాప్, కల్కి–పూజ, సిద్ధార్ధ–మేఘన, ఆకర్ష్‌–భూమి...లు తమదైన నత్యాలతో అలరించనున్నారు. కుటుంబ విలువలను వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ రూపొందిన కొత్త ఫిక్షన్‌ షో కూడా హోలీ రోజునే ప్రారంభం కానుంది.  మధ్యాహ్నం 2.30గంటలకు మిఠాయి కొట్టు చిట్టమ్మ పేరుతో పిక్షన్‌ షో లాంచ్‌ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయ పురంకు చెందిన చిట్టెమ్మ అనే మహిళ జీవిత కధ చుట్టూ ఈ షో తిరుగుతుంది. 

చదవండి : హీరోయిన్‌ కీర్తి వల్ల బతుకు బస్టాండ్‌ అయ్యింది : నితిన్‌
‘రంగ్‌దే’ మూవీ రివ్యూ

 

మరిన్ని వార్తలు