హీరోగా ‘కట్టప్ప’కొడుకు.. ‘మాయోన్' ఫస్ట్‌ సింగిల్‌కి అనూహ్య స్పందన

14 Dec, 2021 17:24 IST|Sakshi

సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ గురించి అందరికి తెలిసిందే. బాహుబలి సినిమాతో తెలుగుకు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సత్యరాజ్‌ అంటే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ.. కట్టప్ప అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేశారు. ఇప్పుడు ఆయన తయయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మాయోన్' విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్సాన్స్ అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మాంపాహి’ అనే పాట విడుదలైంది. ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇలయరాజా సంగీతం అందరిని ఆకట్టుకుంటుంది.  

అంతే కాదు అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కులు ఈ పాట‌కు అనూహ్య స్పంద‌న అందిస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.  పాట తమిళ వెర్ష‌న్ యూ ట్యూబ్ లో 24 గంటల లోపే మిలియ‌న్ వ్యూస్ పైగా అందుకోవ‌డం విశేష. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్‌లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుద‌లవ్వ‌నున్నాయి.

మరిన్ని వార్తలు