ఆ పుకార్లు నమ్మకండి: సంజయ్‌దత్‌

12 Aug, 2020 12:27 IST|Sakshi

సంజయ్‌దత్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి  తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం గురించి వివిధ రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఊపిరితిత్తుల కాన్సర్‌తో బాధపడుతున్నారని,దానికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆగస్టు 8 వతేదీన  ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి రావడంతో ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో చేరారు. ఆయనకు కరోనా టెస్ట్‌లు చేయగా నెగిటివ్‌ అని తేలింది. అయితే దీనికి సంబంధించి సంజయ్‌ దత్‌ ట్వీట్‌ చేశారు.

నేను కొంత సమయం పాటు నా పనికి బ్రేక్‌ ఇచ్చాను. నా ఆరోగ్యం కొద్దిగా క్షీణించడంతో  చికిత్స నిమిత్తం హాస్పటల్‌లో చేరాను. ఇక్కడ నేను నా కుటుంబ సభ్యులు, హాస్పటల్‌ సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. ప్రస్తుతం నేను బాగున్నాను. నా గురించి వస్తున్న పుకార్లను దయచేసి ఎవరు నమ్మకండి. మీ అందరి అభిమానం, ఆశీస్సులతో నేను త్వరగానే తిరిగి వస్తాను’ అని ట్విట్టర్‌లో తెలిపారు.   ఇక సంజయ్‌దత్‌ ప్రస్తుతం ఆలియాభట్‌ నటిస్తున్న సడక్‌2 చిత్రంలో కనిపించనున్న విషయం తెలిసిందే. సంజయ్‌ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులతో పాటు చాలా మంది సెలబ్రెటీలు సైతం సంజయ్‌దత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్విట్‌ చేస్తున్నారు. 

చదవండి: ‘సంజయ్‌ జీవితమంతా పోరాడుతూనే ఉన్నారు’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా