Jai Bhim Actress: జై భీమ్‌లో సినతల్లిగా మెప్పించిన నటి ఎవరో తెలుసా!

5 Nov, 2021 15:54 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య ప్రధాన పాత్రలో తమిళనాడు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జై భీమ్‌’. దీపావళి సందర్భంగా ఓటీటీ సంస్థ ఆమెజాన్‌ ప్రైంలో విడుదలైన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఓ కేసులో అరెస్టు అయిన తన భర్త కనిపించకపోవడంతో అతడిని కనిపెట్టేందుకు, అతడి మరణానికి కారణం తెలుసుకునేందుకు ఓ గర్భిణీ మహిళ చేసిన పోరాటమే ఈ సినిమా కథాంశం.

చదవండి: మహేశ్‌ బాబుకు దీపావళి బహుమతులు పంపిన పవన్‌ దంపతులు

ఇది తమిళనాడుకు చెందిన గిరిజన మహిళ నిజ జీవిత కథ కూడా. ఈ చిత్రంలో భర్త కోసం పోరాటం చేసిన గిరిజన మహిళ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాత్రలో కనిపించిన నటి ‘సినతల్లి’గా అందరి మన్ననలు అందుకుంది.  దీంతో గిరిజన మహిళగా కనిపించిన ఆ నటి ఎవరా  అందరూ సెర్చ్‌ చేయడం ప్రారంభించారు. ఇంతకి ఆమె ఎవరూ, తన అసలు పేరు ఏంటీ.. సినిమాల్లోకి ఎలా వచ్చిందో చూద్దాం.
(చదవండి: Jai Bhim: ఎవరీ జస్టిస్‌ చంద్రు? జై భీమ్‌ మూవీతో ఆయనకేం సంబంధం?)

జై భీమ్‌లో ‘సినతల్లి’గా లీడ్‌రోల్‌ పోషించిన ఈ మలయాళ నటి పేరు లిజోమోల్ జోస్. ఆమె కేరళకు చెందిన ఉన్నత మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె సినిమాల్లోకి రాకముందు అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఓ చానల్‌లో పని చేసింది. పాండిచ్చేరి యూనివర్శిటీ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ సైన్స్‌లో లిజో మాస్టర్స్‌ చదివింది. ఈ క్రమంలో తన స్నేహితురాలి సూచన మేరకు సినిమా ఆడిషన్స్‌కు ఫొటోలు పంపించింది.

చదవండి: జై భీమ్‌ హిట్‌ టాక్‌: ఆ సీన్‌పై దుమారం

ఆడిషన్స్‌లో మూడు రౌండ్ల అనంతరం ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘మహాశింబే ప్రతీకారం’ మూవీతో తమిళ పరిశ్రమకు ఎన్నికైంది. ఈ మూవీతోనే లిజో వెండితెరకు పరిచమైంది. 2016లో వచ్చిన ‘రిత్విక్‌ రోషన్‌’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హనీ బీ 2.5’ సినిమాతో మలయాళ స్టార్‌ నటిగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల హీరో సిద్దార్థ్‌ నటించిన తమిళ చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చాయ్’ (ఒరేయ్ బామ్మర్ది) మూవీతో హీరోయిన్‌గా నటించింది. ఇందులో సిద్ధార్థ్‌కు జోడిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. 

ఈ సినిమాల్లో ఆమె నటనను చూసి జ్ఞానవేల్‌ ‘జై భీమ్‌’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం లీజో తనని తాను మేకోవర్‌ చేసుకని డీ గ్లామర్‌గా రోల్‌ నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. భర్త రాజన్న మరణానికి సంబంధించిన సీన్లు, పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్లలో లిజో అసలు గ్లీజరిన్‌ లేకుండా ఏడుపు సన్నివేశాలు చేసినట్లు ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిజో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తన బంధువు, స్నేహితుడైన అరుణ్‌ అంటోనీని అక్టోబర్‌ 5న ఆమె క్రిస్టియన్‌ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. 

చదవండి: దీపావళి సర్‌ప్రైజ్‌: తనయులతో జూ. ఎన్టీఆర్‌, ఫొటో వైరల్‌

A post shared by Lijomol Jose (@lijomol)

మరిన్ని వార్తలు