పప్పులో కాలేసిన బాలీవుడ్‌ స్టార్‌.. మమ్ముట్టికి బదులు చిరుకు విషెస్‌

9 Sep, 2021 14:13 IST|Sakshi

మలయాళ నటుడు, మెగాస్టార్‌ మమ్ముట్టి మంగళవారం (సెప్టెంబర్‌ 7న) 70వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఎంతోమంది నటులు, రాజకీయవేత్తలు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే బాలీవుడ్‌ నటుడు జాకీష్రాప్‌ పొరపాటున మలయాళ మెగాస్టార్‌కి బదులు టాలీవుడ్‌ మెగాస్టార్‌కి విషెస్‌ తెలిపాడు.

మలయాళీ నటుడు రెహమాన్‌ ట్విటర్‌లో మమ్ముక్కతో ఉన్న ఫోటోని పో​స్ట్‌ చేసిన మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ పోస్ట్‌ కింద ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలి చిరు గారు’ అంటూ జాకీష్రాప్‌ కామెంట్‌ చేశాడు. తప్పును గుర్తించిన ఓ ట్విటర్‌ యూజర్‌ తెలిపిన్పటికీ జగ్గుదాదా ఆన్‌లైన్‌ లేకపోవడంతో డిలీట్‌ చేయలేదు.

మరిన్ని వార్తలు