-

తెలుగులో హీరోయిన్‌గా, పనిమనిషిగా నటించిన బ్యూటీ.. కొట్టి మరీ ఏడిపించారు.. గుర్తుపట్టారా?

26 Nov, 2023 15:58 IST|Sakshi

జై సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో పనిమనిషిగా కామెడీ పండించి నంది అవార్డు అందుకుంది. ఆ తర్వాత సైడ్‌ క్యారెక్టర్లు చేసిన ఆమె తమిళంలోనే స్థిరపడిపోయింది. తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌ను వదిలేసి స్మాల్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ సీరియల్స్‌ చేసింది. కొంతకాలంగా సినిమాలకు, సీరియల్స్‌కు దూరంగా ఉంటోంది. ఇంతకీ ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? సంతోషి శ్రీకర్‌. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో తను ఎందుకు సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పిందనే విషయాన్ని బయటపెట్టింది.

రీల్‌ జంట రియల్‌ జంటగా..
సంతోషి మాట్లాడుతూ.. నాన్నది విజయవాడ. పుట్టిపెరిగిందంతా చెన్నైలో. జై సినిమా చేసేటప్పుడు కూడా తెలుగు రాదు. కానీ నా భర్తది హైదరాబాద్‌. మేమిద్దరం కలిసి హీరోహీరోయిన్స్‌గా సీరియల్‌ చేశాం. రియల్‌ లైఫ్‌లోనూ భార్యాభర్తలమయ్యాం. జై, ఆర్య.. రెండు సినిమాలకు నన్ను సెలక్ట్‌ చేశారు. అయితే జై చిత్రానికి నేను పర్ఫెక్ట్‌ అని భావించడంతో అందులోకి తీసుకున్నారు, ఆర్య చేజారిపోయింది. పూరీ జగన్నాథ్‌ నుంచి కూడా ఆఫర్స్‌ వచ్చాయి. చాలా వదులుకున్నాను.

కొట్టి మరీ ఏడిపించారు
జై మూవీలో ఏడ్చే సీన్‌ ఉంటుంది. నాకు కన్నీళ్లు రావడం లేదని కొట్టి మరీ ఏడిపించారు. ఆ సినిమాకు నేను డబ్బులు తీసుకోలేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చేసే సమయంలో నా వయసు పదిహేడున్నరేళ్లు. ఆ విషయం చెప్తే ఎవరూ నమ్మలేదు. సినిమాలు చేస్తే ఏడాదిలో రెండు, మూడు నెలలే పని ఉంటుంది. అదే సీరియల్స్‌ అయితే ప్రతి నెలా పని ఉంటుంది. పైగా అక్కడ స్కిన్‌ షోతో పాటు బెడ్‌రూమ్‌ సీన్లు చేయమంటారు. అది ఇష్టం లేకే సినిమా ఇండస్ట్రీ వదిలేసి బుల్లితెరకు షిఫ్ట్‌ అయిపోయాను. ఇకపోతే నా ఇల్లును తాకట్టు పెట్టి మరీ బ్యూటీ అండ్‌ జ్యువెలరీ బిజినెస్‌ ప్రారంభించాను. నాకు మంచి అవకాశాలొస్తే తిరిగి నటించడానికి సిద్ధంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది సంతోషి శ్రీకర్‌.

చదవండి: స్టార్‌ కమెడియన్‌ మరణం.. ఆస్తి రాసినా దక్కలేదు.. అనాథలా వదిలేసిన కుటుంబం.. దిక్కు తోచని స్థితిలో..

మరిన్ని వార్తలు