రామానుజ జీవిత చరిత్రతో ‘జయహో రామానుజ’

6 Jun, 2022 09:00 IST|Sakshi

సాయి వెంకట్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సుదర్శనం ప్రొడక్షన్స్‌పై సాయి ప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, మోషన్‌ పోస్టర్‌ని నిర్మాతలు వడ్లపట్ల మోహన్, ప్రసన్న కుమార్, టీఎఫ్‌సీసీ ప్రెసిడెంట్‌ కొల్లి రామకృష్ణ, సెన్సార్‌ బోర్డు మెంబర్‌ అట్లూరి రామకృష్ణ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సాయి వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘11వ శతాబ్దంలోని భగవత్‌ రామానుజుల జీవిత చరిత్ర ఆధారంగా ‘జయహో రామానుజ’ తెరకెక్కిస్తున్నాం. 50 శాతం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఈ నెల 15 నుంచి మూడవ షెడ్యూలు ప్రారంభిస్తాం. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నాం. మొదటి భాగాన్ని ఈ ఏడాది దసరాకు, రెండవ భాగాన్ని 2023 మే 5న రామానుజ జయంతి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు