RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది, ఎప్పుడంటే..

2 Oct, 2021 17:50 IST|Sakshi

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్ర ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి బిగ్‌ బ్రేకింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఇప్పటికి ఎన్నోసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌ నెలకొంది. ప్రేక్షకులంతా ఈ మూవీ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుస్తూన్న తరుణంలో తాజాగా డైరెక్టర్‌ రాజమౌళి ఈ సస్పెన్స్‌కు తెర దింపాడు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అలియాల కొత్త లుక్‌ను పరిచయం చేస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది 2022 జనవరి 7వ తేదీన మూవీ విడుదల చేయబోతున్న ట్విటర్‌లో వెల్లడించారు.

మరిన్ని వార్తలు