దిల్జిత్‌.. కరణ్‌ పెంపుడు జంతువు: కంగన

3 Dec, 2020 18:17 IST|Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం కంగనకు, నటుడు, సింగర్‌ దిల్జిత్ దోసంజ్‌కి మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. అతడిని కరణ్‌ జోహర్‌ పెంపుడు జంతువు అంటూ కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం​ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగన.. రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ సిక్కు మహిళను ఉద్దేశించి.. షాహీన్‌ బాగ్‌ దాదీలలో ఒకరైన బిల్కిస్‌ బానుగా భావించి.. ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తప్పుగా ట్వీట్‌ చేయడంతో నెజిటనులు కంగనపై విరుచకుపడ్డారు. వెనకా ముందు చూసుకోకుండా.. ట్విట్‌ చేస్తే ఇలానే అవుతుంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు, సింగర్‌ దిల్జత్‌ దోసంజ్‌ క్వీన్‌ హీరోయిన్‌ని ఉద్దేశించి ‘కంగన.. బిల్కిస్‌ బానుగా ట్వీట్‌ చేసిన మహిళ ఈమె.. పేరు మహిందర్‌ కౌర్‌. కంగన టీమ్‌ ఈ నిజం వినండి. ఎవరూ ఇంత గుడ్డివాళ్లలా ఉండకూడదు. ఆమె(కంగన) ఏమైనా చెప్తూనే ఉంటారు’ అంటూ మహీందర్‌ కౌర్‌ మాట్లాడిన వీడియోను కూడా ట్వీట్‌ చేశారు దిల్జిత్‌. 

దీనిపై కంగనా మండిపడ్డారు. దిల్జిత్‌ని కరణ్‌ పెంపుడు జంతువు అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దిల్జిత్‌ ట్వీట్‌పై స్పందిస్తూ కంగన.. ‘ఓ కరణ్‌ జోహర్‌ పెంపుడు జంతువు.. షాహీన్‌ బాగ్‌లో తన పౌరసత్వం కోసం నిరసన చేసిన దాదీ.. ఇప్పుడు రైతులు కనీస మద్దతు ధర కోసం చేస్తోన్న ఆందోళనలో కేవలం వంద రూపాయల కోసం వచ్చి కూర్చున్నది. మహీందర్‌ కౌర్‌ జీ ఎవరో నాకు తెలియదు. మీరంతా ఏం డ్రామాలు ఆడుతున్నారు.. వెంటనే ఆపేయండి’ అంటూ విరుచుకుపడ్డారు కంగనా. (చదవండి: కంగనా ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి... లేదంటే!)

ఇక ఎంఎస్‌ మహీందర్‌ కౌర్‌ని చూసి బిల్కిస్‌ బాను అనుకోని కంగనా ట్వీట్‌ చేసినందుకు లీగల్‌ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్‌ సింగ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. 'ఫ్యాక్ట్‌ చెక్‌' అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో బానో మాట్లాడుతూ...నేను ఆరోజు నిరసనలో పాల్గొనలేదని, షహీన్‌ బాగ్‌లోని తన నివాసంలోనే ఉన్నానని.. ఫోటోలో కనిపించింది నేనుకాదని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు