‘సాహో’ డైరెక్టర్‌తో కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ మూవీ!

4 Mar, 2021 10:29 IST|Sakshi

కన్నడ స్టార్‌ హీరో సుదీప్, తెలుగు యువదర్శకుడు సుజిత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి శాండిల్‌వుడ్‌ వర్గాలు. ఇటీవల బెంగళూరు వెళ్లి సుదీప్‌కు ఓ కథ చెప్పారట సుజిత్‌. ఈ స్టోరీ లైన్‌ సుదీప్‌కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌తో రావాల్సిందిగా సుజిత్‌ను కోరారని సమాచారం. మరి... ఎస్‌ (సుదీప్‌) అండ్‌ ఎస్‌ (సుజిత్‌) కాంబినేషన్‌లో సినిమా సెట్‌ అవుతుందా? వేచి చూడాలి.

ఇదిలా ఉంటే తెలుగులో శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌’, ప్రభాస్‌తో ‘సాహో’ చిత్రాలు తెరకెక్కించారు సుజిత్‌. ‘సాహో’ తర్వాత సుజిత్‌ ఓ హిందీ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. మరి.. సుదీప్‌తో చేయనున్నది ఆ చిత్రమేనా? లేక కన్నడంలో ఏమైనా ప్లాన్‌ చేశారా? ఈ రెండూ కాకుండా తెలుగులో స్టార్‌ హీరోతో తీయబోయే సినిమాలో సుదీప్‌ని కీలక పాత్రకు అడిగారా? అనేది తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు