బర్త్‌డే: స్వయంగా లేఖ రాసుకున్న కరీనా

21 Sep, 2020 11:05 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ నేటితో 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆమె తన పుట్టిన రోజును ఆదివారం రాత్రి ముంబైలో ​కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్‌, సోదరి కరిష్మా కపూర్‌, తల్లిదండ్రులు బబిత రణధీర్‌తో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా కరీనాకు సోషల్‌ మీడయాలో బాలీవుడ్‌ ప్రముఖులు, సహనటులు, అభిమానుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీనా స్వయంగా ఓ లేఖ రాసుకున్నారు. ఇన్నేళ్ల తన జీవితంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకున్నారు. తన జీవితం‍లో శక్తివంతురాలిగా ఉన్నందుకు తనకు తాను ధన్యవాదాలు తెలుపుకున్నారు. అదే విధంగా ‘శక్తివంతమైన స్త్రీగా మలచుకోవడానికి తీసుకున్న నా నిర్ణయాల్లో, అనుభవాల్లో కొన్ని గొప్పవి ఉన్నాయి. తప్పులు కూడా ఉన్నాయి. అలాగే మార్చిపోలేనివి కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ పుట్టిన రోజు నాకు గొప్ప అనుభూతిగా ఉంది’ అంటూ కరీనా తన లేఖలో రాసుకొచ్చారు.

Birthday girl ❤️❤️❤️ we love you #happybirthday #fabulousatanyage

A post shared by KK (@therealkarismakapoor) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు