మొత్తానికి కరీనా-సైఫ్‌ జంట గృహప్రవేశం!

12 Jan, 2021 15:40 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ జంట సైఫ్‌ అలీఖాన్‌-కరీనా కపూర్‌ కొత్తింట్లోకి అడుగు పెట్టబోతున్నారు. కొడుకు తైమూర్‌ అలీఖాన్‌తో కలిసి వీలైనంత త్వరగా గృహప్రవేశం చేయనున్నారు. విశేషమేమిటంటే ఆ ఇల్లును వీళ్లు కొన్నేళ్ల క్రితమే కొనుగోలు చేశారు. కానీ అందులోకి షిఫ్ట్‌ అవడానికి ఆలస్యం చేస్తూ వచ్చారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో ఈ జంట కొత్తింట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోందని కరీనా తండ్రి, నటుడు రణ్‌ధీర్‌ కపూర్‌ వెల్లడించారు. అయితే సరిగ్గా ఏ తేదీ రోజున గృహప్రవేశం చేస్తారనేది ఇంకా తెలియదన్నారు. కాగా ప్రస్తుతం సైఫ్‌ కుటుంబం ముంబైలోని ఫార్చ్యూన్‌ హైట్స్‌లో నివసిస్తోంది. (చదవండి: కరీనా కపూర్‌కు కోడలిని అవుతా..!)

కాగా తాజాగా కరీనా కపూర్‌ అమ్మాయిల గ్యాంగ్‌తో కలిసి హవా చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో కరీనాతో పాటు నటీమణులు మలైకా అరోరా, కరిష్మా కపూర్‌, అమృత అరోరా ఉన్నారు. ఇదిలా వుంటే కరీనా ప్రస్తుతం గర్భవతి అన్న విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టులో తను రెండోసారి గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది.  కాగా సైఫ్‌ ప్రస్తుతం ప్యాన్‌ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో రావణుడిగా కనిపించనున్నారు. అలాగే తాండవ్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. మరోవైపు భూట్‌ పోలీసులు చిత్రంలోనూ మెరవనున్నారు. (చదవండి: ఫాంలో తైమూర్‌‌.. బుడ్డి పటౌడికి నెటిజన్‌లు ఫిదా)

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు