రిలయన్స్‌ జోరు : మార్కెట్ల రికార్డుల హోరు

12 Jan, 2021 15:39 IST|Sakshi

బ్యాంకు షేర్ల భారీ లాభాలు

రిలయన్స్‌ జోరు

సాక్షి,ముంబై: దేశీయ మార్కెట్లు మరోసారి సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి మళ్లాయి.   అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఓలటైల్‌ ధోరణికి స్వస్తి చెప్పి లాభాల్లోకి ప్రవేశించింది. రోజంతా అదే ధోరణిని కొనసాగించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ ఆటో షేర్ల లాభాల ఫలితంగా కీలక సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్‌ 49500 స్థాయిని,నిఫ్టీ 14500 స్థాయిని అధిగమించాయి. సెన్సెక్స్‌  248 పాయింట్లు ఎగిసి 49,517 వద్ద,  నిప్టీ  79 పాయింట్లు జంప్‌చేసి 14563 వద్ద ముగిసాయి. సెన్సెక్స్  డే కనిష్ట స్థాయి నుండి 490 పాయింట్లు పెరిగి 49,569 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. అలాగే నిఫ్టీ మొదటిసారి 14,500 మార్కును అధిగమించడం, రికార్డు ముగింపును నమోదు చేయడం విశేషం.

బ్యాడ్‌లోన్లపై ఆర్‌బీఐ ప్రకటన తరువాత డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఆ తరువాత అనూహ్యంగా బ్యాంకింగ్‌ షేర్లు పుంజుకున్నాయి. దీంతో  నిఫ్టీ బ్యాంకు లాభపడింది. టాటా మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టాటా స్టీల్‌, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. మరోవైపు, ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసిజి స్టాక్స్ లాభాల బుకింగ్ కారణంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. డీఎల్‌ఎఫ్‌, గెయిల్‌, ఐషర్‌ మోటార్స్‌, కోల్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌,  టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌ , సన్‌ఫార్మా , టెక్‌ మహీంద్రా, టైటన్‌ , దివిస్‌ ల్యాబ్స్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు