సినిమా షూటింగ్‌లో కరెంట్‌ షాక్‌తో ఫైటర్‌ మృతి.. స్పందించిన సీఎం

10 Aug, 2021 21:00 IST|Sakshi

యశవంతపుర: ‘లవ్‌ యూ రచ్చు’ చిత్రం షూటింగ్‌లో కరెంట్‌ షాక్‌తో సహాయ ఫైటర్‌ మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన వివేక్‌ (28) రామనగర తాలూకా జోగనదొడ్డి వద్ద సోమవారం షూటింగ్‌ చేస్తుండగా కరెంట్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు సహాయకులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు. దర్శకుడు శంకర్‌రాజ్, నిర్మాత గురుదేశ్‌పాండె, ఫైట్‌ మాస్టర్‌ వినోద్‌లను బిడిది పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

మరో వైపు కన్నడ చిత్రపరిశ్రమలో జరుగుతున్న లోపాలు, భద్రత ప్రమాణాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిత్రయూనిట్, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని వివేక్ కుటుంబసభ్యులు,  డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. షూటింగ్‌లకు సంబంధించిన కొన్ని నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు