క్యాటరింగ్‌ నుంచి హీరోగా..  రిలీజ్‌కు రెడీ అయిన డూడీ చిత్రం

5 Sep, 2022 09:41 IST|Sakshi

తమిళసినిమా: దేనికైనా ప్రతిభే ప్రామాణికం. దీన్ని నిజం చేస్త.. క్యాటరింగ్‌ నిర్వాహకుడైన కార్తీక్‌ మధుసదన్‌ కథానాయకుడిగానూ, దర్శకుడుగానూ పరిచయమయ్యారు. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం డూడీ. ఈయనతో పాట శ్యామ్‌ ఆర్‌డీ ఎక్స్‌ దర్శకత్వంలో భాగస్వామ్యం పంచుకున్నారు. నటి శ్రితా శివదాస్‌ నైతిక నటించిన ఇందులో జీవరవి, అర్జున్‌ మణికంఠన్, మదుసదన్,  అక్షత ఎడ్విన్‌ రాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 16వ తేదీన థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా శనివారం చెన్నైలో మీడియా సమావేశంలో దర్శకుడు, కథానాయకుడు మాట్లాడుతూ తాను క్యాటరింగ్‌ పని చేశానని, అయితే తన తండ్రి చిత్ర పరిశ్రమలో ప్రొడెక్షన్‌ విభాగంలో పని చేశారని తెలిపారు. తనకు చిన్నప్పటి నుం సినిమా అంటే ఆసక్తి అని సంగీతంలోనూ ప్రవేశం ఉందని చెప్పారు. దీంతో తన కోరికను తీర్చుకోవడానికి ఇక సమయం లేదని భావించి ఈ చిత్రంతో కథానాయకుడుగా, దర్శకుడుగా పరిచయం అయిన ట్లు చెప్పారు. డూడీ మం మంచి ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు.   
 

మరిన్ని వార్తలు