ఆ స్టార్‌ హీరో సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన వంటలక్క

13 Jul, 2021 11:08 IST|Sakshi

కార్తీకదీపం సీరియల్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్‌ అయిన నటి ప్రేమీ విశ్వనాథ్‌. వంటలక్కగా తన సహజసిద్ధమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమా అవకాశాలు వచ్చినా కాదనుకున్న ప్రేమీ విశ్వనాథ్ తాజాగా ఓ బడా ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి- హీరో రామ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. రామ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇటీవలె ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్‌ వంటలక్కను సంప్రదించగా.. కథ నచ్చడంలో ఆమె కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పాత్ర కోసం వంటలక్కకు మంచి పారితోషికాన్ని కూడా ఆఫర్‌ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కార్తీకదీపం సీరియల్‌తో హీరోయిన్‌కు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథ్‌..ఇక వెండితెరపై కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యిందంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.  దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 


 

మరిన్ని వార్తలు