karthika Deepam: క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఆ దేవుడు ఇవ్వలేదు

25 May, 2021 13:48 IST|Sakshi

కార్తీకదీపం 1048వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

కార్తీకదీపం మే 25: దీప టాబ్లెట్‌ వేసుకున్న మరు క్షణంలో కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో సౌందర్య, పిల్లలు కంగారు పడిపోతుంటారు. తల్లికి ఏమైందోనని శౌర్య, హిమలు భయంతో ఏడుస్తుంటారు. ఇంతలో కార్తీక్‌, మురళీ కృష్ణ ఇంటికి రాగానే పిల్లల ఏడుపు వినిపించడంతో కంగారు పడుతూ ఇంట్లోకి వస్తారు. అక్కడ దీప జీవచ్చవంలా పడి ఉండటం చూసి మురళీ కృష్ణ షాక్‌ అవుతాడు. కార్తీక్‌ దీపకు నీళ్లు తాగించగా అవి బయటకు వచ్చేస్తాయి. అలా షాక్‌లో దీప వంకే చూస్తుండిపోతూ.. ‘కనీసం ఆ దేవుడు నాకు క్షమణలు కోరే అవకాశం కూడా ఇవ్వడం లేదేంటి దీప. నాకు నిజం తెలిసిందని నీకు చెబితే అదే నిన్ను సంజీవినిలా బ్రతికేంచేదని’ కార్తీక్‌ మనసులో అనుకుంటూ దీపను దగ్గరగా పట్టుకుని హత్తుకుంటాడు. 

ఇక పిల్లలు ఏడుస్తుంటే అమ్మకు ఏం కాదు మీరు ఊరుకొండమ్మా అని చెప్పి సౌందర్యతో.. మమ్మీ పిల్లలను దగ్గరికి తీసుకో అంటాడు. మురళీ కృష్ణ కూడా అమ్మ దీపా అంటు బాధపడుతుంటే నన్ను నమ్మండి దీపకు ఏంకాదు ఎలాగైనా తనని బ్రతికించుకుంటానని ధైర్యం చెబుతాడు. వెంటనే ఫోన్‌ తీసి డాక్టర్‌ గోవర్ధన్‌ నెంబర్‌ ఉంటుందని దానికి కాల్‌ చేసి ఆపరేషన్‌ థియేటర్‌ రెడీ చేయమని చెప్పు మమ్మీ అని సౌందర్యకు ఫోన్‌ ఇస్తాడు. అలాగే డాక్టర్‌ భారతికి కూడా ఫోన్‌ చేసి చెప్పిన హాస్పిటల్‌కు రమ్మని చెప్పమంటాడు. ఇక దీపను హాస్పిటల్‌కు తీసుకేళ్లి ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్తుంటే నీకు ఏంకాదు ఎలాగైనా బ్రతికించుకుంటాం నువ్వు ధైర్యంగా ఉండు దీప అంటుంది సౌందర్య.

అలాగే మురళీ కృష్ణ కూడా ఆ దేవుడు నీ వైపు ఉన్నాడమ్మా నీకు ఏం కాదు అంటాడు. దీప కార్తీక్‌ వంక చూస్తు దగ్గరగా రమ్మనంటు సైగ చేస్తుంది. దీంతో కార్తీక్‌ దగ్గరగా వచ్చి దీప చేయిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ‘ఇవి నాకు చివరి క్షణాలని నాకు అర్థమవుతుంది డాక్టర్‌ బాబు... నేను వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త.. ఇప్పటికైనా నన్ను నమ్మానని చెప్పండి డాక్టర్‌ బాబు హాయిగా కళ్లు మూస్తాను’ అని అంటుండగా డాక్టర్‌ వచ్చి పెషేంట్‌ కండీషన్‌ తెలియదా ఇంక ఇక్కడే ఉంచారేంటని హడవుడి చేస్తాడు. మరోవైపు మోనిత తన హాస్పిటల్‌కు వెళ్లడానికి రెడీ అవుతుంటే ప్రియమణి కాఫీ తీసుకువస్తుంది.

కాఫీ తెమ్మని చెప్పిన అరగంటకు తెస్తావా నీకు బద్దకంగా బాగా పెరిగిపోయిందే అంటుంది మోనిత. దీంతో ప్రియమణి.. బద్దకం కాదమ్మా, పని ఎక్కువై అన్ని పనులు నేనే చూసుకోవాలి కదా అంటుంది ప్రియమణి. ఆ కాఫీ తాగి మోనిత హాస్పిటల్‌కు బయలుదేరబోతుంటే డాకర్‌ భారతి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెబుతుంది. దీంతో మోనిత తెగ ఆనందపడుతూ.. ఫొన్‌ అవునా!.. వస్తున్న వెంటనే బయలుదేరుతున్నా అంటు బాధపడిపోతున్నట్లు నమ్మిస్తుంది. ‘దీపమ్మ ఆస్పత్రిలో చేరిందనగానే మీ మొహంలో ఆనందం కనిపించిందమ్మ. దయ చేసి దీపమ్మను చంపడం లాంటివి చేయకండి’ అని ప్రియమణి మోనితతో అనగానే నాకు ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచనే లేదే నువ్వు అన్నాకే వచ్చింది. చూస్తా అంటు వెళ్లిపోతుంది. 

మరోవైపు ఆదిత్య ఏమైంది అమ్మ రాగానే వదిన ఆరోగ్యం బాగాలేదని వెళ్లిపోయింది.. ఇప్పటి వరకు ఫోన్‌ చేయలేదని కంగారు పడుతూ అందరికి ఫోన్‌ చేస్తాడు. ఎవరు ఫోన్‌ కాల్స్‌ ఎత్తకపోవడంతో చిరాకుపడుతుంటాడు. మురళీ కృష్ణ నా కూతురికి ఏమైందమ్మా ఏదైనా ప్రాణాంతక రోగమా అనగానే.. సౌందర్య ఏడుస్తూ దానికి ఏం కాదు, ఇక్కడ నా కొడుకు ఉన్నాడు దీపను ఎలాగైనా బ్రతికించుకుంటాం... ఈ హాస్పిటల్‌ నుంచి సంతోషంగా నా కోడల్ని తీసుకెళ్తాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో మోనిత అక్కడకు వస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో దీప, మోనితలు మాట్లాడుకుంటారు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు నా ప్రాణం పోగానే ఇక్కడే నా భర్తతో తాళి కట్టించుకునేందుకు ఎదురు చూస్తున్నావని తెలుసు అంటుండగా... డాక్టర్‌ బాబు అక్కడికి వస్తాడు. గెట్‌ అవుట్‌ మోనిత నా భర్తతో నేను మాట్లాడాలి అంటుంది దీప. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు