ఊర్వశి ఓటిటిలో ‘కాశీ వర్సెస్‌ లవ్‌’ విడుదల

16 Aug, 2021 14:46 IST|Sakshi

చిన్న, సంధ్య దయన్,  ముఖ్య పాత్రల్లో కొప్పుల అశ్విని కామరాజు దర్శకత్వంలో నంది కె రెడ్డి నిర్మించిన చిత్రం కాశీ వర్సెస్‌ లవ్. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అగస్ట్ 15న ఊర్వశి ఓటిటిలో  విడుదలైంది. ఈ  సందర్బంగా చిత్ర నిర్మాత నంది కె రెడ్డి మాట్లాడుతూ  ..లవ్ అండ్ ఎంటర్ టైనర్‌గా ఓ భిన్నమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం. ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ఇచ్చేలా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఊర్వశి ఓటిటి లో విడుదల చేస్తున్నామని చెప్పారు. 

దర్శకుడు అశ్విని కామరాజు మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథలు చూసాం..  కానీ ఈ మూవీని సరికొత్త తరహాలో ప్రేమ కథగా తెరకెక్కించాం. హీరో,హీరోయిన్స్ తో పాటు ఈ టీం అంతా కొత్తవారే. భిన్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ప్రేమికుడికి నచ్చుతుంది. ఈ చిత్రాన్ని ఊర్వశి ఓటీటీలో విడుదల చేయడం హ్యాపీగా ఉంది’ అన్నారు. ఈ మూవీలో చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జరవారిపల్లికి  చెందిన చిన్న హీరోగా బెంగళూరుకు చెందిన సంధ్య హీరోయిన్‌లు కాగా.. మరో 10 మంది స్థానికులు దయాన్, కిరణ్ కుమార్, మాచిరు మారెప్ప, సిరి, రెడ్డప్ప, లక్ష్మి రేఖ, కోటకొండ మురళి తదితరులు నటించారు. 

మరిన్ని వార్తలు