అవును.. నేను చనిపోయాననుకున్నా!

1 Mar, 2021 07:56 IST|Sakshi

ఆ సమయంలో చనిపోయాను అనుకుందట!

జెమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్‌–2’ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సినిమా కోసమే కాదు షూటింగ్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు సినీ అభిమానులు. ఈ సినిమాలో టైటానిక్‌ ఫేమ్‌ కెట్‌ విన్‌స్లేట్‌ ‘రోనల్‌’ అనే కీలక పాత్ర పోషించింది. ఊపిరి బిగపట్టి  నీటి అడుగు భాగంలో 7 నిమిషాల 14 సెకన్ల సీన్‌ ఒకటి చేసినప్పుడు కొన్ని నెలల క్రితం ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో చూసి అభిమానులు ఆహా, ఓహో అన్నారు.

ఈ సీన్‌కు సంబంధించి తన అనుభవాన్ని తాజాగా ‘అబ్జర్వర్‌’ మ్యాగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది కెట్‌ విన్‌స్లేట్‌. ‘మది స్తంభించిపోయింది. కనిపిస్తున్న నీటిబుడగలను చూడడం తప్ప ఏ ఆలోచనా లేదు. ఒక దశలో నేను చనిపోయానా? అవును... నేను చనిపోయాను...అనుకున్నాను’ అని చెప్పింది. భయం సంగతి ఏమిటో గానీ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమా కోసం టామ్‌క్రూజ్‌ ఆరునిమిషాల అరసెకను పాటు ఊపిరిబిగపట్టిన రికార్డ్‌ను కెట్‌ విన్‌స్లేట్‌ బ్రేక్‌ చేసింది.

చదవండి: వైరల్‌: టైటానిక్‌ మరో క్లైమాక్స్ సీన్‌‌ వీడియో!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు