'బిగ్‌బాస్'‌ వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి

9 Apr, 2021 20:40 IST|Sakshi

బిగ్‌బాస్‌..ఓ ఫేక్‌ రియాల్టీ షో : నటి 

ముంబై : దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్‌ అయిన రియాల్టీ షో బిగ్‌బాస్‌. ఈ షో ద్వారా కొందరికి ఓవర్‌ నైట్‌ స్టార్‌ డం వస్తే..మరికొందరికి మాత్రం అప్పటిదాకా ఉన్న ఫేం పోయి అపఖ్యాతి మూటగట్టుకుంటారు.  గతంలోనూ ఇలాంటి పరిస్థితి చాలా మంది కంటెస్టెంట్‌లకు ఎదురైంది. తాజాగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌-14లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా పాల్గొన్న  ప్రముఖ నటి కవిత కౌశిక్‌ ఈ షోపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. బిగ్ బాస్ వల్లే తన కెరీర్ నాశనమైందని చాలా సార్లు పేర్కొన్న కవిత.. తాజాగా బిగ్ బాస్ షో గురించి ఓ అభిమాని ప్రశ్నించగా..అది ఫేక్‌ రియాల్టీ షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.


'బిగ్ బాస్ షోలో మీరు పాల్గొనకుండా ఉండాల్సింది. అది మీ కెరీర్‌ను నాశనం చేసింది. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కావొచ్చు. కానీ ఓ ఫ్యాన్‌గా మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' అని  అభిమాని ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన కవిత..'ఇట్స్ ఓకే అయినా ఒకసారి ఇమేజ్ పాడైందంటే మనం ఇంకా ఫ్రీగా ఉండొచ్చు. ఈ ఫేక్ రియాల్టీ షో తర్వాత నాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు' అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌పై కవిత చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌గా మారాయి.


సీరియల్‌ నటిగా పాపులర్‌ అయిన​ కవిత..హౌస్‌లోకి వైల్డ్‌ కార్ఢ్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.చీటికిమాటికి హౌస్‌మేట్స్‌తో గొడవ పడ్తూ వార్తల్లో నిలిచేది. ఈ సీజన్‌  విజేత రుబినాతో రుబినాతో జరిగిన ఓ పెద్ద గొడవ తర్వాత ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో పాల్గొని చాలా తప్పు చేశానని పలుమార్లు  చెప్పుకొచ్చింది. తాజాగా ఖత్రోన్ కే ఖిలాడీ అనే మరో రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం వచ్చినా ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. ఇప్పటినుంచి ఇంకే రియాల్టీ షోలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. 

చదవండి : నటితో బిగ్‌బాస్‌ విన్నర్‌ లిప్‌లాక్‌.. వీడియో వైరల్‌
బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం: ఫొటోలు వైరల్!‌


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు