డేట్‌కి వెళ్తున్నాను!

18 Sep, 2020 03:50 IST|Sakshi
కియారా అద్వానీ

కియారా అద్వానీ లీడ్‌ రోల్‌లో నటించిన హిందీ చిత్రం ‘ఇందూ కీ జవానీ’. అబిర్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇందూ గుప్తా పాత్రలో కనిపిస్తారు కియార. బాయ్‌ఫ్రెండ్‌ దొరక్క ఇబ్బందులు పడే అమాయకపు అమ్మాయి పాత్రలో నటించారామె. చివరికి డేటింగ్‌ యాప్స్‌లోనూ బాయ్‌ఫ్రెండ్‌ కోసం ప్రయత్నాలు మొదలెడుతుంది ఇందూ. మరి బాయ్‌ఫ్రెండ్‌ దొరికాడా? లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ చిత్రం టీజర్‌ విడుదలయింది.

‘నేను తొలిసారి డేట్‌కి వెళ్తున్నాను’ అని ఆ టీజర్‌లో ఇందూ అంటుంది. ఇటీవలే ఈ చిత్రంలో ఓ పాటను విడుదల చేశారు. ‘హసీనా పాగల్‌ దీవానీ....’ అంటూ సాగే ఈ హుషారైన పాటకు కియారా స్టెప్స్‌ అదనపు ఆకర్షణ. గతంలో మైకా సింగ్‌ రూపొందించిన ‘సవన్‌ మే లగ్‌ గయి...’ పాటకు ఇది రీమిక్స్‌. మైకా సింగ్‌తో పాటు ఆశీస్‌ కౌర్‌ రీమిక్స్‌ పాటను ఆలపించారు. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా