రంభలా ఆ పాత్రల్లో నటించాలని ఆశించేదాన్ని: ఐశ్వర్య రాజేష్‌

24 Jul, 2021 10:33 IST|Sakshi

చిన్నతనంలో చిత్రాలు చూసినప్పుడు నటి రంభలా తాను కూడా గ్లామరస్‌ పాత్రలో నటించాలని ఆశపడేదాన్నని నటి ఐశ్వర్య రాజేష్‌ పేర్కొన్నారు. ఈమె తాజా చిత్రం తిట్టం ఇరండు (ప్లాన్‌ బి)లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలో నటించింది. ఇందులో నవ నటుడు సుభాష్‌ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం త్వరలో సోనీ లైవ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో  స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ  సందర్భంగా చిత్రం యూనిట్‌ శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు మాట్లాడుతూ ఇది  క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమని తెలిపారు.

ఐశ్వర్య రాజేష్‌ మాట్లాడుతూ తాను ఇందులో పోలీసు అధికారిగా నటించినట్లు తెలిపారు. తను తెలుగింటి ఆడపడుచునని.. చిన్నతనంలో రంభలా గ్లామరస్‌గా నటించాలని ఆశించేదానన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్‌ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని, అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్‌ పేర్కొన్నారు. ఈ అమ్మడు తన సినిమా సెలక్షన్‌లో ఆచితూచి అడుగులు వేస్తుందని, పాత్ర నచ్చితే తప్ప రోల్‌ చేయడానికి అంగీకరించదని వినికిడి. అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాకు ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్‌ కు వెళ్లిపోయాయి. ఇటీవల ఇందులో ఓ ముఖ్య పాత్రలో ఈ భామ కనిపించనుందని స‌మాచారం. బ‌న్నీకి చెల్లెలుగా ఐశ్వ‌ర్య క‌నిపించ‌నున్న‌ట్లు అప్పట్లో టాక్‌ వినిపించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు